News

ప్రజల చేతిలోనే పూర్తి సమాచారం.. వాట్సాప్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటలైసెషన్   లో మరో ముందడుగు వేసింది . ప్రభుత్వ నికి సంబందించిన  సమస్త సమాచారాన్ని నిమిషాల్లో ప్రజలకు అందించేందుకు  విధంగ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ తో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్.. ఏపీడీసీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పాలనా విధానాలు, సంక్షేమ పథకాలను డిజిటల్ వేదికల ద్వారా జనాలకు అందించే ఏర్పాట్లు చేసింది ఏపీడీసీ. అయితే దాన్ని మరింతగా విస్తరించేందుకు వాట్సాప్ సేవలను వినియోగించుకోబోతోంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు వేగంగా ప్రజలకు చేరువ కానున్నాయి .

 అత్యాధునికి సాంకేతికతను  పూర్తిగా వినియోగించుకుంటూ.. వాట్సాప్ సేవలను పూర్తిస్థాయిలో విస్తరించాలని యోచిస్తోంది . త్వరలోనే వాట్సాప్ చాట్‌బోట్ సేవలను కూడా ఏపీడీసీ అందుబాటులోకి తేనుంది. ఏపీ ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వేరుగా లబ్దిదారులకే అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మరింతగా సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది

ప్రభుత్వ సమగ్ర సమాచారాన్ని జనాలకు వేగంగా అందించడమే కాదు.. తప్పుడు  వార్తలకు చెక్ పెట్టాలని చూస్తోంది జగన్ ప్రభుత్వం . ఇందుకోసం వాట్సాప్ సేవలను ఉపయోగపడుతాయని భావిస్తోంది. ప్రస్తుతం మొబెైల్ ఫోన్ జనాలకు నిత్యావసరంగా మారిపోయింది.  పల్లెటూర్లలో కూడా హై టెక్నాలజీ ఫోన్లను వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా సమాచారం నిమిషాల్లోనే జనాలకు విస్తరిస్తోంది.

వాట్సాప్ కొత్త ఫీచర్ ఎప్పుడు గ్రూప్ లో 512 సభ్యులు !

వాట్సాప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీడీసీ వైస్ ఛైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను మారుమూల గ్రామాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాట్సాప్, చాట్‌బోట్ సేవలతో ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. ఇ-గవర్నెన్స్‌ పారదర్శకత కోసం  ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు గర్వంగా ఉందని వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ చీఫ్ శివనాథ్ ఠుక్రాల్ చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం తమకు దక్కుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాల వివరాలను  ప్రజలకు చేరవేయడంతోపాటు తప్పుడు వార్తల వ్యాప్తిని కట్టడి చేసేందుకు వాట్సాప్‌ సేవలు పనిచేస్తాయని చెప్పారు.

TS TET 2022 ఫలితాలు జూన్ 27న విడుదల కానున్నాయి ..

Share your comments

Subscribe Magazine

More on News

More