News

9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ..!

Srikanth B
Srikanth B
9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ..!
9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ..!

కరోనా సమయంలో నిలిచిపోయిన చేప మందు పంపిణీని తిరిగి రెండు సంవత్సరాల తరువాత చేప మందు పంపిణీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ,జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్న ట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు, మంగళవారం చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సో దరులు మరియు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తో సమావేశం నిర్వహించిన మంత్రి ఈమేరకు 9న మృగశిర కార్తె సందర్భంగా చేపల మందు పంపిణి చేయనున్నట్లు వెల్లడించారు .

చేపమందు పంపిణి సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాగునీటి సదుపాయంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం,హెల్త్ క్యాంప్ ల ఏర్పాటుతో పాటు అంబులెన్స్ ను సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పంపిణీకి సంబందించిన ఏర్పాట్లపై ఈ నెల 25న సంబంధిత శాఖల అధికారులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్..ఇళ్ల స్థలాలు, పోడు భూముల పంపిణీకి తేదీ ఖరారు చేసిన సీఎం

చేప మందు కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా లాంటి దేశాల నుంచి కూడా ఆస్తమా బాధితులు హైదరాబా ద్ కు వస్తారని బత్తిన అమర్ నాథ్ గౌడ్ తెలిపారు. కరోనా కారణంగా మూడేండ్లుగా చేపమందు పంపిణీ నిలిపివేయడం జరిగిందని, దాంతో ఈ సారి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వచ్చే అవకాశం ఉందని జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీన ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు నిర్విరామంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు .


ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్..ఇళ్ల స్థలాలు, పోడు భూముల పంపిణీకి తేదీ ఖరారు చేసిన సీఎం

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine

More on News

More