తెలంగాణాలో భూ సమస్యలు అంత ఇంతకాదు .. భూముల డిజిటలైసెషన్ ప్రక్రియలో భాగంగా ధరణితో వచ్చిన సమస్యలు ఒక ఎత్తు అయితే పోడు భూముల సమస్యలు మరోవైపు , తెలంగాణాలో పోడు భూముల వివాదం ఎంతవరకు ముదిరిందంటే ఫారెస్ట్ అధికారిని నరికి చంపేతవరకు ... ఇప్పటికి పోడుభూముల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కేడే అన్నట్లు గ వున్నాయి అయితే నాగోబా జాతరకు హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేస్లాపూర్ నుంచే అందిస్తామని హామీని ఇచ్చారు .
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
PM కిసాన్ కోసం ధరఖాస్తు చేసుకోండి ఇలా ...
నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ విమర్శించారు .
Share your comments