News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుండి రాగి జావ పంపిణీ..

Gokavarapu siva
Gokavarapu siva

తృణధాన్యాల్లో రాగికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాగిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ అధిక పోషకాలు కలిగిన రాగుల యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలిసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చుడుతున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రాగిజావను అందించనుంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ఈ రాగిజావను అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ రాగిజావను పిల్లలకు అందించడానికి అదనంగా రూ.86 కోట్లను ఖర్చుచేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనితో మొత్తానికి పోషకాహారం కొరకు ప్రభుత్వం రూ.1910 కోట్లను కేటాయిస్తుంది. ఈ రాగిజావను పిల్లలకు అందించడం ద్వారా వారికి చదువుపై మరింత ఏకాగ్రత పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ప్రభత్వం విద్యార్థులకు బలవర్థకమైన ఆర్హరాన్ని అందించాలనే దృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే పాఠశాలల్లో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందేలా ప్రభుత్వం మధ్యాహ్న భోజనలను అందిస్తుంది. ఇప్పటి పిల్లల్లో ఎక్కువగా కాల్షియమ్, ఐరన్, వంటి పోషక లోపాల వలన వారిలో రక్తహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ఐరన్ మరియు కాల్షియమ్ అనేది రాగిలో అధికంగా ఉంటాయి.

కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల్లో ఈ సమస్యలను నివారించడానికి వారానికి మూడు రోజులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం ఈ రాగిజావను అందిందనున్నారు. ఈ క్రమంలో మంగళవారం విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ !

ప్రస్తుతం రాష్ట్రమంతట 37,63,968 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రాగిజావను పంపిణి చేయనున్నారు. వీటితోపాటు కోడిగుడ్లు, చిక్కీలు, మరియు ఆకుకూరలతో ఇప్పటికే రాష్ట్రమంతటా ప్రతి విద్యార్థికి మంచి పోషకాలున్న ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు ఈ రాగిజావను వారికి అందించడం ద్వారా వారిలో పోషకలోపం నివారించవచ్చని తెలుపారు. వారిలో ఏకాగ్రత కూడా పెరగడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ !

Share your comments

Subscribe Magazine

More on News

More