
దేశంలోని ప్రతి రంగం అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అందుబాటులోకి తెస్తుంది. అటువంటి పథకాల్లో ఒకటి పీఎం కిసాన్. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి వారికి ఆర్ధిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న రాజస్థాన్ లో జరిగిన బహిరంగ సభలో రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అదే సమయంలో, పథకం 15 వ విడత నవంబర్-డిసెంబర్ మధ్య విడుదల చేయవచ్చు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ 14వ విడతలో భాగంగా 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.17,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. దీంతో పాటు ఇప్పుడు 15వ విడత దరఖాస్తు కూడా ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాలో రూ.6,000 జమ చేయడం గమనార్హం.
రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి ఇప్పుడే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. మరోవైపు రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం తమ KYCని అప్‌డేట్ చేసి లబ్ది పొందవచ్చు . OTP-ఆధారిత సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారులు MKISAN పోర్టల్‌లో eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇది కూడా చదవండి..
ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తున్నారా.! జాగ్రత్త.. ఈ పని మాత్రం చేయవద్దు..
PM కిసాన్ యోజన: దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు
మొబైల్ ఫోన్ నంబర్
ల్యాండ్ హోల్డింగ్ పేపర్లు
బ్యాంక్ ఖాతా వివరాలు
ఆదాయ ధృవీకరణ పత్రం.
14వ విడత అందని అర్హులైన రైతులు PM కిసాన్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని కూడా పేర్కొనడం గమనార్హం . హెల్ప్‌లైన్ నంబర్లు 011-24300606 మరియు 155261, మరియు టోల్-ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది: 18001155266. రైతులు తమ ఫిర్యాదులను[email protected]లేదా [email protected] ఇమెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments