News

పుట్టగొడుగులు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా?

KJ Staff
KJ Staff
Health benefits of eating Mushrooms
Health benefits of eating Mushrooms

పుట్టగొడుగు ఒక శిలీంధ్రం(fungi), కానీ దీనిని కూరగాయగా ఉపయోగిస్తారు, పుట్టగొడుగులు అనేక పోషకాలతో నిండి ఉంటాయి . ఇది చాలా తక్కువ కేలరీల ఆహార పదార్థం. ఇందులో ఫైబర్ , ప్రోటీన్ మరియు మినరల్స్ చాలా ఉంటాయి. పుట్టగొడుగులలో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు మరియు ఖనిజాలు పుష్కలంగా అందుతాయి . ఇందులో ప్రధానంగా విటమిన్ బి, పొటాషియం, కాపర్ మరియు విటమిన్ డి ఉంటాయి.

పుట్టగొడుగుల యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:

1. క్యాన్సర్ నిరోధక శక్తి పెంచుతుంది:

పుట్టగొడుగులలో సెలీనియం అధిక స్థాయిలో ఉంటుంది. సెలీనియంలో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ పీడిత పరిస్థితులను తొలగించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధులు, థైరాయిడ్‌ వ్యాధులు దూరం చేస్తుంది.

2. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది:

ఒక కప్పు వండిన పుట్టగొడుగుల్లో ఒక రోజు తీసుకోవాల్సిన రాగి ఉంటుంది. ఇందులో ఉండే ముఖ్యమైన పోషకాలు మరియు ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.

3. యవ్వనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది:

పుట్టగొడుగులలో ఆర్గాథైన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గ్లుటాతియోన్ పుష్కలంగా ఉన్నాయి, ఈ రెండూ ఒత్తిడి వల్ల కలిగే శారీరక మార్పులను నిరోధించడం ద్వారా శరీరం యొక్క అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కలిసి పని చేస్తాయి.

ఇది కూడా చదవండి :

ఈ 5 పదార్ధాలు తింటే క్యాన్సర్ ను కొనితెచ్చుకున్నట్టే జాగ్రత్త!

4. మెదడును రక్షిస్తుంది:

పుట్టగొడుగులలో కనిపించే రెండు ప్రధాన యాంటీ-ఆక్సిడెంట్లు, అర్గాథినిన్ మరియు గ్లూటాతియోన్, రెండూ పార్కిన్సన్స్ వ్యాధి మరియు అల్జీమర్స్ వ్యాధి నుండి మెదడును రక్షిస్తాయి. భవిష్యత్తులో నరాల సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడటానికి ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం 5 పుట్టగొడుగులను తినాలని సిఫార్సు చేస్తున్నారు.

 

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

పుట్టగొడుగులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, తద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని తొలగిస్తుంది. ఇది ఊపిరితిత్తులు, కాలేయం మరియు పెద్దప్రేగు వంటి శరీరంలోని ప్రధాన అవయవాల నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయం చేస్తుంది.

ఇది కూడా చదవండి :

ఈ 5 పదార్ధాలు తింటే క్యాన్సర్ ను కొనితెచ్చుకున్నట్టే జాగ్రత్త!

Share your comments

Subscribe Magazine

More on News

More