News

పీఎం కిసాన్ 14 వ విడత ఎప్పుడో తెలుసా ..!

Srikanth B
Srikanth B

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన అనేది దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు పెట్టుబడి మద్దతును అందించే కేంద్ర రంగ పథకం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అవసరంతో పటు రైతుల యొక్క కనీస ఆర్థిక అవసరాలు తీర్చడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, అర్హులైన రైతులు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం పొందుతారు, ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలోచెల్లిస్తుంది .

ఇటీవల, PM-KISAN యోజన యొక్క 13వ విడత ఫిబ్రవరి 27  2023లో విడుదల చేయబడింది, ఇది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు చాలా ఆర్థిక ఉపశమనాన్ని అందించింది . అయితే, ఈ పథకం యొక్క 14వ విడత కోసం రైతులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇది ఏప్రిల్ మరియు జూలై 2023 మధ్య విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనల ద్వారా అందుతున్న సమాచారం .


14వ విడత విడుదల తేదీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. అయితే, రైతులు PM-KISAN పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్థితిని తనిఖీ చేయవచ్చు. అలా చేయడానికి, రైతులు pmkisan.gov.inని సందర్శించి, హోమ్ పేజీలోని 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్' ఎంపికను ఎంచుకోవాలి. వారు తమ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్‌ని చూడటానికి వారి రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసి, 'డేటా పొందండి'పై క్లిక్ చేయాలి.

కబ్జా భూములకు ప్రభుత్వ పట్టా .. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరణ !


13వ విడత అందని అర్హులైన రైతులు PM కిసాన్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని కూడా పేర్కొనడం గమనార్హం . హెల్ప్‌లైన్ నంబర్లు 011-24300606 మరియు 155261, మరియు టోల్-ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది: 18001155266. రైతులు తమ ఫిర్యాదులను pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

కబ్జా భూములకు ప్రభుత్వ పట్టా .. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరణ !

Related Topics

PMKISANSAMANNIDI

Share your comments

Subscribe Magazine

More on News

More