లంచం తీసుకోవడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం లోని కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం హక్కుగా భావిస్తుంటారు కొందరు అధికారులు , లంచం తీసుకోకుండా పనిచేస్తే ఎదో కోల్పోయిన భావన కొందరు అధికారులది 2022 సంవత్సరం లో 105 మంది అధికారులను రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్నారు ACB అధికారులు . అంటే లంచగొండితనం ఏమేరకు ఉందొ అర్ధమవుతుంది .
ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ ) లంచం నిర్ములనకు శతవిధాల కృషి చేస్తుంది . అయితే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్న డబ్బుపై పింక్ రంగు నీటి బాటిల్ లను పెట్టడం మనం చూస్తుంటాము అయితే దానివెనుక పెద్ద రహస్యం వుంది .
పింక్ కలర్ బాటిల్ ఎందుకు పెడతారో తెలుసా?
ఎవరైనా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడానికి ACB అధికారులు ముందుగా ఆ అధికారికి ఇచ్చే డబ్బు నోట్లపై ఒక కెమికల్ పౌడర్ ను పూస్తారు తరువాత ఆ డబ్బును అధికారులే మారువేషంలో లేదా లంచం ఇవాల్సిన వ్యక్తికి ఇచ్చి పంపుతారు . అధికారి డబ్బును తీసుకున్న తరువాత ACB అధికారులు అధికారులు ఆ అధికారిని పట్టుకొని అతని చేతులను నీటిలో ముంచుతారు ఆ నీరు పింక్ రంగులో మారితే అతను ఆ నోట్లను ముట్టుకున్నాడని అర్ధం అంటే అతను లంచం తీసుకున్నాడని నిర్దారింఛి పట్టుబడిన డబ్బుపై పింక్ రంగు బాటిల్ లను ఉంచుతారు .
శ్రీలంక బాటలో పాకిస్థాన్ .. రూ . 150 కి పెరిగిన పిండి ధర ....
ACB గురించి ...
అవినీతి నిరోధక బ్యూరో అనేది ప్రభుత్వంలోని వివిధ శాఖలలోని అవినీతి సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక ఏజెన్సీ. అవినీతి నిరోధక చట్టం, 1988 నిబంధనల ప్రకారం ప్రభుత్వోద్యోగులపై కేసులను నమోదు చేస్తుంది. ప్రభుత్వం, విజిలెన్స్ కమిషన్, లోక్ అయుక్త మరియు సాధారణ ప్రజల వంటి వివిధ ఏజెన్సీల నుండి వచ్చిన పిటీషన్ల ఆధారంగా బ్యూరో విచారణలను కూడా నిర్వహిస్తుంది.
ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను కూడా ఏసీబీ ఏర్పాటుచేసింది .
Share your comments