వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు రైతులు చాలావరకు రెండు తలలు పామును చూసే వుంటారు ,అయితే కొందరు పామును చూసి బయపడి వాటి జోలికి వేళ్ళని వారు ఉంటే మరికొందరు మాత్రం రెండు తలలు పాము కనిపించగానే దానిని పట్టుకొని అమ్మితే లక్షాధికారులు కావొచ్చని కలలు కంటారు అయితే వాస్తవానికి ఆ పాము కు శాస్త్రీయం పరంగా ఎటువంటి విలువలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు .
ద్వారపూడికి చెందిన కత్తుల లోవరాజు అనే వ్యక్తి పొలంలో పని చేస్తుండగా రెండు తలలు పోలిన విచిత్ర రూపంలో పాము కదులుతూ ఉండటం గమనించాడు.
ద్వారపూడిలో రైతుకు దొరికిన పాము అరుదైనదిగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీని పేరు రెడ్ సాండ్ బోయా అని అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీశాఖ రేంజర్ కరుణాకర్ తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అయితే ఈ పాములో విషం ఉండదని రెండు వైపుల తల ఉండటం కారణంగా వేగంగా కదల్లేదని తెలిపారు. పట్టుకున్న పాముకు రెండు తలలు ఉండవని ఎలుక బొరియల్లో దూరినప్పుడు చురుగ్గా కదలలేకపోవడం వలన ఎలుకలు కొరికేసి రెండవ వైపు తలను పోలిన ఆకారం ఏర్పడుతుందన్నారు.
ఫిబ్రవరి 14 " కౌ" హగ్ డే ఉత్తర్వులు రద్దు చేసిన కేంద్రం
అయితే ఈ పామునే రెండు తలల పాముగా క్షుద్రపూజలకు వినియోగిస్తారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ చేసే వన్యప్రాణుల్లో ఈ పాము ఒకటన్నారు. రెండ్ సాండ్ బోయా లక్షల రూపాయలకు అమ్ముకుంటారని చెబుతున్నారు. ఈ రకం పాముల్ని రక్షించేందుకు ప్రభుత్వం వణ్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్-4లో దీనిని చేర్చిందని వివరించారు. అయితే క్షుద్రపూజలకు మినహాయిస్తే వీటికి ఎటువంటి విలువ లేదని తెలిపారు .
Share your comments