సాధారణంగా చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే. కారు ఎక్కగానే ఇంజన్ స్టార్ట్ చేసి వెంటనే ఏసి కూడా ఆన్ చేస్తారు. ఇలా ఏసీ ఆన్ చేయడంతో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఏసీ ఆన్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనం కారును పార్క్ చేసినప్పుడు సేఫ్టీ కోసం డోర్స్ అన్ని లాక్ చేసే వెళ్తాము. ఈ విధంగా డోర్స్ అన్నీ క్లోజ్ చేయటం వల్ల మన కారులో 400-800 మిల్లీ గ్రాముల బెంజిన్ పేరుకుపోతుంది. ఇది కేవలం నీడలో పార్క్ చేసినప్పుడు మాత్రమే ఇన్ని గ్రాముల బెంజిన్ ఏర్పడుతుంది అదే కనుక ఎండలో పార్క్ చేసినట్లయితే బెంజిన్ ఉత్పత్తి మరింత అధికమవుతుంది . సుమారుగా రెండు వేల నుంచి 4 వేల మిల్లీ గ్రాముల బెంజిన్ ఉత్పత్తి అవుతుంది.
ఈ విధంగా మనం మన పనులన్నింటినీ పూర్తిచేసుకుని తిరిగి కారులోకి రాగానే కారులో ఏర్పడినటువంటి బెంజిన్ ను మనం పీల్చుకుంటాము. ఇది రసాయనం కనుక ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మన ఎముకలపై కాలేయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి సమయంలోనే కార్లు ఏసి ఆన్ చేయడం వల్ల అది ఇంజన్ లో ఉన్నటువంటి వేడిని కారు లోపలికి వచ్చేలా చేస్తుంది.ఈ క్రమంలోనే కారులో బెంజిన్ కలిసి ఉండటం వల్ల ఇది పీల్చినప్పుడు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదాలు కూడా ఉన్నాయి.కనుక మనం ఎప్పుడైతే కారు ఎక్కితే మనకు ప్లాస్టిక్ కాలుతున్న వాసన వస్తుందో వెంటనే కాసేపు విండో గ్లాస్ డౌన్ చేయడం వల్ల ఈ ప్రమాదకర సమస్య నుంచి బయట పడవచ్చు.
Share your comments