News

ఎన్నికలు వస్తున్నాయ్.! మీ ఫోన్లోనే డిజిటల్ ఓటర్ కార్డును సులువుగా డౌన్లోడ్ చేసుకోండిలా!

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఓటర్ కార్డుకు దరఖాస్తు చేకున్న ప్రతి పౌరుడికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను అందిస్తుంది. మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ గుర్తింపు కార్డు చాల ముఖ్యం. పొరపాటున ఈ ఓటు కార్డు కనుక కనబడకపోతే పూర్వం ఓటు వేయడానికి కూడా ఉండేది కాదు. కేవలం ఓటు వేయడానికే మాత్రమే ఈ కార్డు పనికివస్తుంది అనుకుంటే పొరపాటు, అనేక సందర్భాలలో మనకు ఈ ఓటు కార్డు ఉపయోగపడుతుంది.

మనం వెళ్లే ప్రతి చోటుకు మనతో ఈ కార్డును తీసుకువెళ్లడం కష్టం. ఒక్కొక్కసారి పని మీదుగా వెళ్ళినప్పుడు, ఇంట్లోనే మరిచిపోతే, ఓటు కార్దు లేక వెళ్లిన పని కూడా ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక నుండి ఇటువంటి సమస్యలను ఎదురుకోకుండా మనం మన ఫోన్లోనే ఈ డిజిటల్ ఓటర్ కార్డును డోములోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని మనకి కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే కల్పించింది. ఆధార్ మరియు పాన్ కార్డు తరహా లోనే మనం ఈ ఓటర్ కార్డు యొక్కకూడా డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆలా చేసుకుని మనకి ఎప్పుడు కావాలన్నా సులువుగా వాడుకోవచ్చు.

ఈ డిజిటల్ ఓటర్ కార్డును పిడిఎఫ్ ఫైల్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్ నుంచి తేలికగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ప్రింట్ తీసుకుని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం 9. కోట్ల మందికి ఉండగా కేవలం ఒక శాతం ఓటర్లు మాత్రమే ఈ ఇ-ఓటర్ ఐడి కార్డు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.! త్వరలో కొత్త రేషన్ కార్దులు.. ఎప్పటినుండి అంటే?

మీ డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

➢ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైటులోకి వెళ్ళాలి.
➢ముందుగానే ఈ వెబ్సైటులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే కొత్త రిజిస్ట్రేషన్
చేసుకోవాలి.
➢వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
➢మీ ఓటర్ కార్డు నెంబర్ ను అందులో ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
➢వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
➢ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
➢ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
➢ఈ విధంగా చేస్తే చిటికెలో మీ స్మార్ట్ ఫోన్‌లోనే పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఈ డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గనుక, ముందుగా మీరు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ఐతే, ఫామ్ 6 రిఫరెన్స్ నంబర్ తో డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.! త్వరలో కొత్త రేషన్ కార్దులు.. ఎప్పటినుండి అంటే?

Related Topics

new voter id apply

Share your comments

Subscribe Magazine

More on News

More