తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గుడ్ ఫ్రైడే మరియు శని ఆదివారాలతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని అంటున్నారు. ఈ భక్తుల రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ భక్తుల రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్‌లను రద్దు చేసి మరి దర్శన సమయాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో టీటీడీ సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
టీటీడీ సామాన్య భక్తులకు నిత్యం 15 గంటల దర్శనం కల్పించడంతోపాటు సామాన్య భక్తులకే 85 శాతం వసతి సౌకర్యాలను తిరుమలలో కల్పించింది. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లలో గోగర్భం డ్యామ్‌వరకు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 48 గంటల సమయం పడుతోందనిటీటీడీ ప్రకటించింది.
ఈ నెల ఏప్రిల్ 7న తిరుమలలోని అన్నయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో సామాన్య యాత్రికులకు దర్శన సమయాన్ని పొడిగించాలని మరియు దీనితోపాటు వీఐపీ బ్రేక్‌లను తగ్గించాలని సూచించారు. మొత్తానికి ఉన్న 18 గంటల సమయంలో వీఐపీ దర్శనం కొరకు 3 గంటలను కేటాయించి, మిగిలిన 15 గంటల సమయాన్ని సాధారణ యాత్రికులకు కేటాయిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
పత్తి రైతులకు ఊరట.. పెరిగిన ధర
సాధారణ యాత్రికుల కోసం 85% వసతి, 7,400 గదులు, నాలుగు పీఏసీలు అందుబాటులో ఉంటాయని ఈవో స్పష్టం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ బోర్డు సూచించింది. మరోవైపు ఇంటర్ పరీక్షలు కూడా ఇటీవలే పూర్తికావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉందని అన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నందున టీటీడీ క్యూలైన్లో ఉన్న భక్తులకు ఆహరం మరియు తాగునీరును అందజేస్తుంది. ఈ భకుట్ల రద్దీ అనేది జులై నెల 15వ తేదీ వరకు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. రద్దీ కారణంగా ఈ నెల కూడా రికార్దు స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశముందని అంటున్నారు. శుక్రవారం శ్రీవారిని 71,782 మంది దర్శించుకోగా.. 36,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Share your comments