ఈ రోజు అర్ధరాత్రి వరుస భూప్రకంపనలు భారతను కుదిపేశాయి. భరత్ లోని అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర లో భూకంపాలు చోటు చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో, గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలోజి నివేదిక ప్రకారం రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం ప్రభావం 3.7 గా ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ లో తెల్లవారు జామున రెండు భూకంపలు సంభవించాయి. మొదట 1:49 గంటలకు 3.7 తీవ్రతతో మొదటి భూకంపం తర్వాత 3.4 తీవ్రతతో 3:40 గంటలకు మరొక్క భూకంపం సంభవించాయి. భూకంపం ద్వారా భయబ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుండి బయటకి పరుగులు తీశారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది.
కృషి విజ్ఞాన్ కేంద్ర స్థాపక దినోత్సవం:
మరో వైపు మహారాష్ట్రలోని హింగోళి నగరంలో కూడా పది నిమిషాల వ్యవధిలో రెండు భూప్రకంపనలు సంభవించాయి. 4.5 తీవ్రతతో ఉదయం 6:08 గంటలకు ఒకసారి, 3.6 తీవ్రతతో 6:19 గంటలకు మరోసారి, వరుస భూకంపాలు సంభవించాయి. భూకంపాల తీవ్రత ఎక్కువగ లేనందు వల్ల ఎటువంటి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కానీ జరగలేదని అధికారులు తెలియచేసారు. వరుస భూకంపాల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.
Share your comments