ప్రకృతిలో ప్రతి జీవికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది.అలాగే వానపాములు (ఎర్త్ వార్మ్ )
ఇవి నేలను సారవంతం చేసి వ్యవసాయానికి సహాయపడతాయి. అందుకే వానపాములను రైతులకు సహజ మిత్రులుగా చెప్పవచ్చు. వానపాము సహజంగా తేమగల నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంది. మనదేశంలో చాలా రకాల వానపాములు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశంలోని ద్రవిడా గ్రాండిస్ జాతికి చెందిన వానపాములు పెద్దవిగాను, పొడుగుగా ఉండి భూమిని సారవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ వానపాములు పులికాట్ సరస్సులో చుట్టూ ఉన్న చిత్తడినేలలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వానపాములను సైతం కొందరు అక్రమార్కులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వీటిని అక్రమంగా తరలించి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు.
సాధారణంగా వానపాములను ఉపయోగించి పంట వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు ఈ విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే.వీటిని అక్రమ రవాణా చేయడానికి ముఖ్య కారణం. వీటిని ఆక్వా రంగంలో తల్లి రొయ్య సంతానోత్పత్తకి ఆహారంగా వానపాములను మేతగా వినియోగిస్తున్నారు.వీటిని ఆహారంగా అందించడం ద్వారా అధికంగా గుడ్లు పెడుతాయి. దీంతో ఆక్వా యజమానులకు రాబడి అధికంగా ఉండటంతో వానపాములను కిలో రూ.3000 నుంచి రూ. 3500 వెచ్చించి వానపాములను కొనుగోలు చేస్తున్నారు.
దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి పులికాట్ సరస్సు చుట్టుపక్కల స్థానిక ప్రజలకు డబ్బు ఎర చూపి చిత్తడి నేలల్లో సమృద్ధిగా ఉన్న వానపాములను త్రవ్వకాలు జరిపి ఎదేచ్చగా
అక్రమ రవాణా చేసి అవినీతి సొమ్మును కూడా కట్టుకుంటున్నారు.వానపాముల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం.కానీ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం వానపాములను అక్రమంగా తరలించి అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తున్నారు.
Share your comments