ఎన్నికల సమయంలో, తెలంగాణలోని రైతులకు అనుకూలమైన ప్రకటన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు నిధుల కేటాయింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పోలింగ్ కు ముందు రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసేందుకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో ఎన్నికల సంఘం (ఈసీ) రైతుబంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఈసీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి ప్రచార సభల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, ఈ నెల 28న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హరీశ్‌రావు హామీ ఇస్తున్నారు. సిద్దిపేటలోనూ ఈ హామీ ఇచ్చారు. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ఉన్నందున, ఆయన ప్రకటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుని అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే డబ్బులు జమ చేయడానికి పర్మిషన్ ఇచ్చి.. ఆర్థిక మంత్రి డబ్బులు జమ చేస్తామని చెప్పడమే తప్పని ఈసీ అనుమతి రద్దు చేయడంపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేటాయింపులు ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులకే కేటాయించి రైతుబంధు వైపు మళ్లించడం కుదరదని, ఖజానాకు నిధులు లేవని పాలకమండలి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ శాఖ ప్రకటన కూడా డబ్బులు జమ చేస్తామని ఎక్కడా చెప్పలేదు.
ఇది కూడా చదవండి..
గుడ్‌న్యూస్! మీ వాహనంపై ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉన్నాయా? వాటిని తగ్గించుకునే లక్కీ ఛాన్స్.. ఎలాగో తెలుసా?
మీడురోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.. 29, 30 వ తేదీల్లో ఈసీ జమ చేయవద్దని చెప్పిందని.. వ్యవసాయసాఖ చెప్పింది. రైతులకు రైతుబంధు డబ్బును డిపాజిట్ చేయడానికి 28వ తేదీ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ రోజున విడుదల చేస్తామని రైతుల ఖాతాల్లో నగదు పడి టింగ్ టింగ్ మని సౌండ్ వస్తుందని హరీష్ రావు చెప్పడం ప్రారంభించారు. అయితే, పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా రైతు బంధు అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం చివరకు నిర్ణయం తీసుకుంది.
అసలు రైతు బంధు అనే పథకానికి నిధులు గత ఏడాది డిసెంబర్ లో నిధులు ఇచ్చారు. అయినా ఈసీ అడగడమే ఆలస్యం.. పోలింగ్ కు ముందు అనుమతి ఇచ్చి విమర్శల పాలయింది. ఇప్పుడు కూడా విమర్శలు తగ్గే అవకాశం లేదు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడానికి ఇలా చేశారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..
Share your comments