పసిఫిక్ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు ఏప్రిల్ లో నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది . ఇంతటితో అయిపోలేదు , రానున్న రోజుల్లో గ్లోబల్ టెంపరేచర్ అపాధారణ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది, ఇది వ్యవసాయ రంగం మీద చెడు ప్రభావం చూపవచ్చని డబ్ల్యూఎంఓ హెచ్చరిస్తుంది.
ఏప్రిల్‌లో, భారత వాతావరణ శాఖ (IMD) 2023లో అసాధారణ రుతుపవనాలను అంచనా వేసింది, దీర్ఘకాల సగటులో 96% వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కానీ దీనికి ఇంకో ప్రమాదం తోడయింది . IMD ప్రపంచ వాతావరణ మోడళ్ల ప్రకారం , "ఎల్ నినో పరిస్థితులు వర్షాకాలంలో( జూన్ - సెప్టెంబర్ ) అభివృద్ధి చెందే అవకాశం ఉందని" సూచించాయి.
ప్రభుత్వం కూడా ఈ పరిస్థితికి ఆందోళన చెందుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క తాజా నెలవారీ సమీక్ష ఎల్ నినో ప్రమాదాన్ని ఫ్లాగ్ చేస్తూ : "ఇది ముఖ్యమైనది...ఎల్ నినో వంటి సంభావ్య ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాల అవసరం
ఈ ఎల్ నినో , కరువు పరిస్థితులను సృష్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గించడం మరియు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ పరిణామాలు మరియు ప్రపంచ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినడం వంటి ఎన్నో దుష్ప్రభావాలకు దారి తీయొచ్చు అని తెలిపింది."
వచ్చే పంటలకు తగినన్ని విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని మరియు పరిస్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయాలని రాష్ట్రాలను కేంద్రం అభ్యర్థించింది
"అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి"ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మరియు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు కొరత ఏర్పడితే తగినన్ని అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్రం బుధవారం తన రాష్ట్రాలను కోరింది.
దేశంలోని వార్షిక వర్షపాతంలో 72 శాతం వచ్చే రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్) లో రానున్నాయని IMD తెలిపింది , రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది .
Share your comments