ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ఒకవైపు సిద్ధం సభలతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, అన్ని జిల్లాలు పర్యటిస్తుంటే మరోవైపు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ, బీజేపీ, ఎన్నికల హామీలతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. మే 13 న ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రెండు పార్టీల వారు హోరాహోరీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల నాయకులూ, దాదాపు అన్ని జిల్లాల్లో తమ పార్టీ తరపు అభ్యర్థులను ఖరారు చేసారు. పార్టీలో కొంత మంది అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక రెండు పార్టీల అధినేతలు ఎన్నికల కాంపెయిన్కు సిద్ధం అయ్యేరు.
మరోసారి అధికారమే లక్ష్యంగా, వై.ఎస్. జగన్ బుధవారం నుండి ఇడుపులపాయ నుండి 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చెయ్యనున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర 21 రోజులు కొనసాగనుంది. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు టీడీపీని తిరిగి మళ్ళి అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారంలో వేగం పెంచారు. ఇవాల్టి నుండి బాబు పలమనేరు నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. 'ప్రజాగళం' పేరుతో రోడ్డుషో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు.
మరోవైపు ఇరుపార్టీల నేతలు మాటల యుద్దాన్ని చేస్తున్నారు. ఈ రోజు ప్రముఖ సోషల్ మీడియా X వేదికగా నారా లోకేష్ అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సూన్యమని మండిపడ్డారు.
వైస్. జగన్ నేటి నుండి మేమంతా సిద్ధం సభలు నిర్వహించనున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ సర్కారు సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది, ప్రభుత్వం అందించే పధకాలు నేరుగా ప్రజలవద్దకే చేరేందుకు వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 26 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఇచ్చి పేదలకు గృహ నిర్మాణాలను చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్లు మరియు హాస్పిటల్స్ రూపురేఖ మర్చి చక్కటి విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. పథకాల లబ్ధిదారుల్లో మహిళలలకు పెద్దపిట వేసింది. అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల హామీలో సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధి పనులకు కూడా స్థానం కల్పిస్తే ప్రజల్లో వైసీపీ పై విశ్వసం మరింత బలపడే అవకాశం ఉంది.
Share your comments