మేతకోసం వచ్చిన ఏనుగు మృతి !
రోజు రోజుకు అడవి విస్తీర్ణం తగ్గే కొద్దీ అడవి జీవులు వాటి ఆహారం కోసం అరణ్యం నుంచి జనావాసాలలోకి వస్తున్నాయి ఇటువంటి ఘటనలు కొత్త ఏమి కాదు కానీ అడవి నుంచి వచ్చిన జంతువులు ఆహార వేటలో తమ ప్రాణాలను కోల్పోతున్నాయి . కొంతమేర ఆట నష్ఠానికి కారణముతూనే కొన్ని చోట్ల రైతులు ఏర్పాటు చేసిన విడుతతిగాలు తగిలి జీవరాసులు మరణిస్తున్నాయి .
అటువంటి ఘటన మరోచోట ఆకలితో అడవి వదిలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుకి అదే చివరి రోజైంది మేత కోసం పొలాల్లోకి వెళ్లిన ఏనుగు కరెంట్ షాక్‌కు గురై గిలగిల కొట్టుకొని చనిపోయింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా వీ-కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పొలంలో ఏనుగు పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనపై ఆరా తీసిన అధికారులు.. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మరణించినట్టు తేల్చారు.
అడవిలో ఉన్నంతవరకే అడవి జీవులయొక్క ప్రాణాలకు రక్షణ బయటకు వస్తే వేటగాళ్ల భారిన లేదా రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చులలో పాడి మరణిస్తున్నాయి .
కేంద్ర నిర్ణయం తో పెరగనున్న వంట నూనె ధరలు !
అటు ఏనుగులో, ఇటు ప్రజలో బలికావాల్సిందే. రీసెంట్‌గా ఏనుగుల గుంపు రైతులపై దాడి చేస్తే.. మరోచోట కంచెకు వేసిన కరెంట్ తగిలి ఏనుగు చనిపోయింది.
మరికొన్ని ప్రాంతాలలో పొలంలో పనిచేస్తున్న ఇద్దరు రైతులపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో గాయపడ్డ రైతులు హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా రెండు జిల్లాలో పచ్చటిపొలాలు, అరటి తోటలు ధ్వంసం చేస్తున్నా.. చేసేదేం లేక దిక్కుతోచని స్థితిలో మౌనంగా ఉండిపోతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏనుగుల్ని అదుపు చేయడంలో అటు అటవీశాఖ అధికారులు చేతులెత్తేశారని రైతులు ఆరోపిస్తున్నారు.
Share your comments