ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ యొక్క సాగు విస్తీర్ణత బాగా పెరిగింది. రాష్ట్రంలో పామాయిల్ సాగులో ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా పామాయిల్ కి డిమాండ్ ఉండటం వలన ఇక్కడి రైతులు పామాయిల్ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో ఈ ఆయిల్ పామ్ ను ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.
రాష్ట్రంలో పామాయిల్ పంట సాగు విస్తీర్ణతలో 50 శాతం చిస్తీర్ణత అనేది కేవలం ఈ ఏలూరు జిల్లాలోనే ఉంది. ప్రతి సంవస్తరం రాష్ట్రంలో నాల్గు వేల ఎకరాల చొప్పున పాల్మయిల్ సాగు విస్తీర్ణత పెరుగుతూ వస్తుంది. మొదటి సారిగా ఉమ్మడి జిల్లాలో 1988లో పామాయిల్ సాగును ప్రారంభించారు. టీఎంఓపీ పథకం కింద 1992లో పెదవేగి ఆయిల్ఫైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో 1996 నుంచి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం ప్రారంభమైంది.
ఈ సంవత్సరం ఏలూరు జిల్లాకు చెందిన 22 మండలాల్లో 2,16,192 ఎకరాల్లో పామాయిల్ ను సాగు చేయడం జరిగింది. రైతులకు కొన్ని పామాయిల్ కంపెనీలు మొక్కలకు సబ్సిడీల కింద హెక్టారుకు రూ.5,250 చొప్పున మొదటి నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుకు జమ చేస్తున్నారు.దానితో పాటు ఈ పామాయిల్ పండించడం వలన అంతర పంటలు వేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. దీని ద్వారా రైతులు అధిక లాభాన్ని కూడా పొందుతారు. దీనితో పాటు ప్రభుత్వం కూడా ఈ పంటను వేయడానికి ప్రోత్సహిస్తుంది.
ఏలూరుకు చెందిన కామావరపుపేట, చింతలపూడి, టి. నర్సాపురం, ద్వారకా తిరుమల మెదళ్లలో ఈ పామాయిల్ సాగు అధికంగా ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2,16,190 ఎకరాల్లో ఆయిల్పమ్ సాగులో ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పమ్ సాగుకు అనుకూలంగా ఉందని, 3.12 లక్షల ఎకరాలు పామాయిల్ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉందని ఉద్యాన శాఖాధికారులు నిర్ధారించారు. దీనిలో 2.16 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. మార్కెట్ ధరలతో సంభంధం లేకుండా జిల్లాలో సాగు అధికంగా జరుగుతుంది.
ఇది కూడా చదవండి..
రాగి సాగు ప్రాముఖ్యత - సాగులో మెళుకువలు ...
ఈ ఆయిల్ పామ్ పంట వేసిన ఐదు సంవత్సరాలనుండే దిగుబడి రావడంతో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంట నుండి ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. నాటిన ప్రతి మొక్క 30 ఎళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. పైగా ఈ పంట పండించడానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. దీనికి నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువ ఉండదు.
ఉధ్యానవన సఖ కొన్ని మండలాలకు కలిపి, కొన్ని కొన్ని కంపెనీలను కేటాయించారు. ఆ కంపెనీ పరిధిలో ఉన్న ప్రాంతాలకు మొక్క సరఫరా నుండి కొనుగోలు వరకు ఆ కంపెనీలే చూసుకోవాలి. జిల్లాలో వివిధ కంపెనీలు అనగా నవభారత్ ఆగ్రో, 3 గోద్రేజ్ ఆర్గో వెట్ కంపెనీలు, ఏపీ ఆయిల్ ఫెడ్, పతంజలి ఫుడ్స్, ఫుడ్స్ అండ్ ప్యాడ్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆయిల్ పామ్ కు అంతర్జాతీయంగా టన్నుకు రూ.13,400 ధర ఉంది.
ఇది కూడా చదవండి..
Share your comments