ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్ అందించింది. కరోనా చికిత్స అవసరాల కోసం లేదా ఇతర వైద్య ఖర్చుల కోసం అకస్మాత్తుగా డబ్బులు అవసరమైతే అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతా నుంచి రూ.లక్ష అడ్వాన్స్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని, ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది.
దీనికి సంబంధించి జూన్ 1న ఈపీఎఫ్ వో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న గంటలోపే ఈ డబ్బును ఈపీఎఫ్ వో ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లో నేరుగా జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల్లో ఈపీఎఫ్ వో ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు ఈపీఎఫ్ వో స్పష్టం చేసింది.
డబ్బులు ఎలా తీసుకోవాలి?
-ఉద్యోగి లేదా కుటుంబసభ్యులు హాస్పిటల్ లేదా పేషెంట్ వివరాలను తెలుపుతూ ఒక అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
-ఇలా అప్లై చేసుకున్న గంటలోపే వివరాలను చెక్ చేసి రూ.లక్ష బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.
-రోగి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ యూనిట్, సీజీజహెచ్‌ఎస్ ప్యానెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండాలి.
-ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. వివరాలు చెక్ చేసిన తర్వాత డబ్బులు మంజురూ చేస్తారు.
ఈపీఎఫ్‌వో గత లాక్ డౌన్ సమయంలో పీఎఫ్ అడ్వాన్స్ అనే స్కీమ్ ను తీసుకొచ్చింది. ఇందులో మొత్తం ఫండ్‌లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ అడ్వాన్స్ కింద మూడు నెలల జీతం తీసుకోవచ్చు. ఆ స్కీమ్‌కు, కొత్తగా ప్రవేశపెట్టిన మెడికల్ స్కీమ్ కు చాలా తేడాలున్నాయి. మెడికల్ స్కీమ్ డబ్బులు గంటలోనే అకౌంట్లో జమ చేస్తాయి. ఉద్యోగులు కోల్పోయిన ఈపీఎఫ్ ఖాతాదారులకు సైతం అడ్వాన్స్ నగదుకు దరఖాస్తు చేసుకుంటే తక్కువ సమయంలోనే వాటికి ఆమోదం తెలుపుతుంది.
Share your comments