మన దేశ ప్రధాన మంత్రి మోదీ దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు మర్చి 17వ తేదీన తెలిపారు. ఈ ఏడు టెక్స్‌టైల్ పార్కులను వివిధ రాష్ట్రాలైన తెలంగాణకు చెందిన వరంగల్లో, మహారాష్ట్రకు చెందిన అమరావతిలో, విరుదునగర్(తమిళనాడు), మధ్యప్రదేశ్ కు చెందిన ధార్, ఉత్తరప్రదేశ్ రాజధానైన లక్నో, కల్బుర్గి(కర్ణాటక), గుజరాత్ కు చెందిన నవ్‌సారీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మోదీ ప్రభుత్వం ఈ టెక్స్‌టైల్ రంగానికి మరింత మరింత బలపరచడానికి 5 ఎఫ్ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడు టెక్స్‌టైల్ పార్కులను నిర్మించనున్నారు. 5 ఎఫ్ అనగా ఫార్మ్-ఫైబర్-ఫ్యాక్టరీ-ఫ్యాషన్-ఫారిన్. ఈ టెక్స్‌టైల్ పార్కుల ద్వారా దేశంలో భారీగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సుమారుగా ఒక లక్ష ఉద్యోగాలనేవి నేరుగా ఈ ఒక్కో టెక్స్‌టైల్ పార్కు ద్వారా లభ్యమవుతాయని తెలిపారు. పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'ఫైబర్ టు ఫ్యాబ్రిక్' నినాదంతో వరంగల్లో 1200 ఎకరాల్లో 'కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు'ను ఏర్పాటు చేసింది. ఈ మెగా టెక్స్‌టైల్ కు వెళ్ళడానికి రహదారులు, విద్యుత్ మరియు తదుపరి వసతులను కల్పించదానికి రూ.897 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి..
స్కోచ్ అవార్డులను దక్కించుకున్న పశుసంవర్ధక శాఖ...
ఇటీవలి 'పీఎం మిత్ర'టెక్స్ టైల్ పార్కు పథకంలో వరంగల్ను చేర్చారు. దీనితో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కూడా ఊతం లభించనుంది. పరిశ్రమల సఖ కార్యదర్శి మాడ్లాడుతూ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఇతర మౌలిక సదుపాయాలతో పాటు దీనికి కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం కూడా సాధ్యమవుతుందని అన్నారు.
కేంద్ర జౌళి శాఖ సుమారుగా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ ఒక్కో మెగా టెక్స్‌టైల్ పార్కు ఆకర్షించే అవకాశం ఉంది అని తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది.
ఇది కూడా చదవండి..
Share your comments