రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వివై పథకం) కింద వయోవృద్ధులకు, భారత సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎడిఐపి పథకం కింద దివ్యాంగులకు తోడ్పాటు, సహాయ పరికరాల పంపిణీ కోసం నాగ్‌పూర్ జిల్లా పరిపాలన శాఖ, నాగ్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి), ఎఎల్ఐఎంసిఒతో కలిసి సామాజిక న్యాయం, సాధికారత విభాగం సామాజిక అధికారత శిబిర్‌ను నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లోని రేషిమ్‌బాగ్ మైదానంలో శుక్రవారం నిర్వహించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీనితిన్ గడ్కరీ, పంపిణీ శిబిరాన్ని ప్రారంభించిన దివ్యాంగులకు, సీనియర్ సిటిజెన్లకు భిన్న సహాయక పరికరాలను, ఎయిడ్స్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమక్షంలో అందచేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ. 3483.00 లక్షల విలువైన మొత్తం 241200 సహాయ పరికరాలను ఉచితంగా 27356 మంది సీనియర్ సిటిజెన్లకు, 7780 మంది దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి, వరుసలో చిట్ట చివర ఉండే వ్యక్తికి ప్రభుత్వ పథక లబ్ధి చేకూర్చడం ద్వారా వారిని సాధికారం చేయడం మన ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలోని సామాజిక సంక్షేమ పథకాలను నాగ్‌పూర్ నగరంలో అమలు చేస్తున్నందుకు కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్‌కు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల నుండి "జాతీయ గోపాల రత్న అవార్డు" కోసం దరఖాస్తులు ఆహ్వానం..మొదటి బహుమతి రూ.5 లక్షలు
కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తొలి దివ్యాంగ్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు తమ మంత్రిత్వ శాఖ సాధ్యమైనంత తోడ్పాటునందించనుందని, ఈ దిశగా త్వరలోనే పని ప్రారంభం కానుందని డాక్టర్ విరేంద్ర కుమార్ ప్రకటించారు. దివ్యాంగులకు సెన్సరీ గార్డెన్ (సంవేదనాత్మక తోట), టెక్స్‌టైల్ పాత్‌వే టచ్ (మార్గంలో తివాచీ పరిచిన భావన), స్మెల్ గార్డెన్ (సువాసనలు పీల్చగల), నైపుణ్యాల శిక్షణా సౌకర్యం, పునరావాస కేంద్రం, క్రీడలు & ఇన్ఫోటైన్‌మెంట్ తదితర భిన్న సౌకర్యాలు ఉంటాయి.
Share your comments