తెలంగాణకు చెందిన అన్వితారెడ్డి ఎవరెస్ట్ ని అధిరోహించిన సందర్బంగా తన అనుభవాలను పంచుకున్నారు.
ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆమెకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఏప్రిల్ మొదటి వారంలో అన్వితారెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నేపాల్ చేరుకున్న తర్వాత ఎవరెస్ట్ పర్వతం యొక్క దక్షిణం వైపు నుండి ఆమె అధిరోహణను ప్రారంభించింది. 9 రోజుల ట్రెక్ తర్వాత ఆమె 17 ఏప్రిల్ 2022న 5300 ఎత్తులో ఉన్న మాచ్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది.
తరువాత ఆమె 7,100 mtr ఎత్తుకు చేరుకుంది. తను మే 12, 2022న బేస్ క్యాంప్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించింది.చివరగా మే 16, 2022 ఉదయం 9.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా ఆమె తన కలను సాకారం చేసుకుంది. అయితే తాను ఇక్కడి దాకా రావడానికి చాల కష్టపడ్డాను అని,పిల్లలకు సాహసాలను పరిచయం చేయమని తల్లిదండ్రులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.
అయితే ఆమెకి పర్వతారోహణ విషయం లో గొప్ప రికార్డు ఉంది. తాను ఆమె ఐదు శిఖరాలను అధిరోహించింది - మౌంట్ ఎవరెస్ట్ (మే 2022), మౌంట్ కిలిమంజారో (జనవరి 2021), మౌంట్ ఖాడే (ఫిబ్రవరి 2021), మౌంట్ ఎల్బ్రస్ (డిసెంబర్ 2021), మరియు మౌంట్ రెనాక్ (2014). తన ఈ ప్రయాణం భువనగిరి లోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో ప్రారంభమైంది, అక్కడ ఆమె కోచ్ శేఖర్ బాబు వద్ద శిక్షణ పొందింది.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినందుకు గాను అన్విత రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్ అచ్చుత రావు బోపన్న మరియు ఆమె కోచ్ శేఖర్ బాబు బాచినేపల్లి ఆమెను అభినందించారు.
మరిన్ని చదవండి.
Share your comments