పేద , మధ్య తరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకుల లలో చిన్న మొత్తం డబ్బులను జమచేసుకొని ఆర్థిక ప్రగతి సాధించడానికి కొన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ చిన్న పొదుపు పథకాలను అమలు పరుస్తుంది . అందులో ముఖ్యమైనది ఆడ పిల్లలకోసం అమలు పరిచే పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఆడ పిల్లల విద్య, పెళ్లి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
వీటిల్లో ఆడ పిల్లల కోసం కూడా ఒక స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
పదేళ్ల వరకు వయసు కలిగిన ఆడ పిల్లలు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. కవలలు పుడితే ముగ్గురి పేరుపై కూడా ఈ ఖాతా తెరిచే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బులను మెచ్యూరిటీ పీరియడ్ కు ముందు విత్ డ్రా చేసుకోవడం కుదరదు. కనీసం 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ బెనిఫిట్స్ సొంతమవుతాయని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి..
రుణమాఫీ అందలేదని ఎస్బిఐ బ్యాంక్ ముందు రైతుల ధర్నా..
18 సంవత్సరాలు నిండిన తర్వాత అత్యవసరం అనుకుంటే 50 శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు 416 రూపాయల చొప్పున పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత ఏకంగా 64 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
పథకం ద్వారా లభించే ప్రయోజనాలు :
10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు.
ఆడపిల్లల పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది.
పోస్టాఫీసుల్లో మరియు అధీకృత బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు.
18 ఏళ్లు నిండిన తర్వాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.
ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్టాఫీసు/బ్యాంకు నుండి మరొకదానికి బదిలీ చేయవచ్చు.
ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments