ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డెయిరీ సమ్మేళనం లో 75 దేశీయ పశు జాతుల ప్రదర్శన జరగనుంది.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ముఖ్య అతిథిగా పాల్గొని, న్యూఢిల్లీలో నిర్వహించబడుతున్న '75 మంది పారిశ్రామికవేత్తల సమ్మేళనం మరియు75 దేశీయ పశు జాతుల ప్రదర్శన' ప్రారంభ సెషన్‌లో ప్రసంగిస్తారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, CIIతో కలిసి పశుసంవర్ధక & పాడిపరిశ్రమ విభాగం, డెయిరీ & పౌల్ట్రీ రైతులు, వినూత్న పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు మరియు పరిశ్రమలపై దృష్టి సారించి కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తోంది, అలాగే ఉత్తమ 75 దేశీయ జాతులను ప్రదర్శించడానికి డిజిటల్ ప్రదర్శనను నిర్వహిస్తోంది.
ఈ సమావేశం ముఖ్యంగా డైరీ రంగంలో ఉత్పాదకతను పెంచడం మరియు జంతువుల ఆరోగ్యం, విలువ జోడింపు మరియు మార్కెట్ అనుసంధానాలు, నూతన ఆవిష్కరణ మరియు సాంకేతికతను మెరుగుపరచడం అనే అంశాలపై దృష్టి సారిస్తుంది. డైరీ రంగంలో అవకాశాలను గుర్తించడం మరియు రైతుల ఆదాయాలను పెంచడం కొరకై డెయిరీ మరియు పౌల్ట్రీ రంగానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై దృష్టి సారించనుంది. ఈ ప్రదర్శనలో డెయిరీ మరియు పౌల్ట్రీ రంగాన్ని మార్చడానికి మరియు రైతుల ఆదాయాలను పెంచే వినూత్న పరిష్కారాలు/ఉత్తమ పద్ధతులను ప్రదర్శించనున్నారు.
ప్రగతిశీల రైతులు, వ్యవస్థాపకులు, అలాగే స్టార్ట్-అప్‌ల అనుభవాల నుండి మెరుగైన మార్కెట్ ని పొందడం ఎలా అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా మారింది.
మరిన్ని చదవండి.
Share your comments