ఈ ఏడాది రైతులకు పంటలు అంతగా కలిసి రాలేదు. మొన్నటి వరకు పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా పంటను రైతులు నష్టపోయారు. వీటితోపాటు మార్కెట్ లో నకిలీ విత్తనాల కారణంగా కూడా ఈసారి రైతులు పంట నుండి అధిక దిగుబడులు కూడా పొందలేదు. ఇప్పటి వరకు రైతులు వాతావరణ పరిస్థుతుల వల్ల నష్టపోతే, ప్రస్తుతం మార్కెట్ లో వచ్చిన దిగుబడులకు ధరలు లేక నష్టపోతున్నారు.
రైతులు కోత కోసి విక్రయించడానికి మార్కెట్ కు ఇసుకువచ్చే సమయానికి వ్యాపారులు సిండికేట్ లుగా మారి ధరలు తగ్గించేస్తున్నారు. నేడు మొక్కజొన్న రైతులకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నాయి. మొన్నటి వరకు క్వింటా మొక్కజొన్న ధర మార్కెట్ లో రూ.2200 పలకగా, ప్రస్తుతం కేవలం రూ.1800కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
రోజురోజుకు మార్కెట్ లో మొక్కజొన్న ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నెల ధర అనేది గత నెలతో పోల్చుకుంటే ఒక క్వింటా మొక్కజొన్నకు నాలుగు వందల రూపాయల వరకు తగ్గింది. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన కూడా, కొనుగోలు కేంద్రాలను మాత్రం ఎక్కడ ఏర్పాటు చేయలేదు. దీనినే వ్యాపారులు అలుసుగా తీసుకుని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని రైతులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
2023 కేంద్రీయ విద్యాలయ 1 వ తరగతి అడ్మిషన్ ..నేటి తో ముగియనున్న గడువు !
మార్కెట్ లో గత సంవత్సరం క్వింటా మొక్కజొన్నకు రూ. 2500 పలికింది. ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర రూ.1960లను ప్రకటించింది. కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. అన్నిగ్రామాలలో రైతుల ఇళ్లకు మొక్కజొన్న పంట దిగుబడులు వచ్చాయి. రోజురోజుకు ధర తగ్గుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
మొదట్లో దిగుబడులు వచ్చిన రైతులు క్వింటా రూ.2200లకు అమ్మకాలు చేశారు. ఇ ప్పుడు క్వింటా రూ.1800లకు వ్యాపారులు అడుగుతున్నారు. దీనితో రైతులు దిగులు పడుతున్నారు. కనీసం పెట్టుబడి ధరలు కూడా రావట్లేదని బాధపడుతున్నారు. కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments