మారుతున్న వ్యవసాయ అవసరాలకు, మరియు ఆహార పరిస్థితులకు అనుగుణం కొత్త రకం కూరగాయలు అభివృద్ధి చెయ్యడం సోమని కనక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేకత. న్యూ ఢిల్లీ లోని వాజిర్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కొత్త రకం కూరగాయలను, హైబ్రిడ్ వెరైటీలను, రైతుల కోసం అభివృద్ధి చేసి వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది.
ఇదే క్రమంలో ఇప్పుడు కొత్త హైబ్రిడ్ క్యారెట్ రకాలను అభివృద్ధి చేసి వాటిని విడుదల చేసింది. మొత్తం మూడు హైబ్రిడ్ రకాలను విడుదల చెయ్యగా, మూడు ఎర్ర రంగు రకాలే మరొక్క ప్రత్యేకత. ఎర్ర రంగు క్యారెట్ రకాలను ఉత్తర భారత దేశంలోని, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగు చేస్తారు. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతాలు ఈ క్యారెట్ సాగుకు అనువుగా ఉంటాయి. సోమని సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు విడుదల చేసిన ఈ క్యారెట్ రకాలను సాగు చెయ్యడం ద్వారా తక్కువ కాలంలోనే పంట చేతికి రావడంతోపాటు, మంచి క్వాలిటీ క్యారెట్స్ పండించవచ్చు. ఈ రకాలను, సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో నాటుకునేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ వారు చెప్తున్నారు.
లోకసభ ఎన్నికలు 2024: 17 నిండిన వారు కూడా ఓటర్ ఐడి పొందవచ్చా......
ఈ మూడు క్యారెట్ రకాలను ఈ రోజు విడుదల చెయ్యనుండగా, సోమని సీడ్స్ ఫీల్డ్ షో ఏర్పాటు చేసింది, ఈ కార్యక్రమానికి, కృషి జాగరణ్ ముఖ్య సంపాదకులు, ఎం.సి.డొమినిక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కృషి జాగరణ్ కంటెంట్ డిజిటల్ హెడ్, వివేక్ కుమార్ రాయ్, మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వర్ధన్ కాసానియా, ఈ కార్యక్రమాన్ని సందర్శించారు.
Share your comments