News

సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు మద్దతు ధర కల్పించాలంటూ ఆందోళనలు!

KJ Staff
KJ Staff

రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు వట్టి సూక్తులు గానే మిగిలిపోతున్నాయి. రైతులు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని నాట్లు వేసి కోతకు వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను ఎంతో ఆశగా వివిధ మార్కెట్లకు తరలిస్తే వ్యాపారులు, అధికారులతో కుమ్మక్కై వారి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేసి రైతుల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో సాగుతోందని కొందరు రైతులు చాలాకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో సంవత్సరాల నుంచి కోనసాగుతున్న దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌కు వేపాడ, ఆనంతగిరి, దేవరాపల్లి, చీడికాడ మండలాలుకు చేందిన రైతులు కూరగాయలను పండించి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తాజాగా మార్కెట్‌కు కూరగాయలు తీసుకువచ్చారు ఈ కూరగాయలను కొనేవారే లేకపోవడంతో వ్యాపారుల చర్యలకు నిరసిస్తూ
రైతులు ఆందోళనలకుదిగారు.

ఈ సమస్యకు ప్రధాన కారణం స్థానిక వ్యాపారస్తులే అని ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే పాడేరు,శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్యాపారులను అడ్డుకుని స్థానిక వ్యాపారులందరూ కుమ్మక్కయి రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూరగాయలు మార్కెట్ కు తీసుకు వస్తే కనీసం మార్కెట్ ఛార్జీలను చెల్లించలేక పోతున్నారని ఇలాంటి దళారీ వ్యవస్థ నుంచి తమను కాపాడాలని కొంతకాలంగా స్థానిక అధికారులతో మొరపెట్టుకున్నారు.

తాజాగా దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌లో
రైతులు తెచ్చిన వివిధ రకాల కూరగాయలను
గిట్టుబాటు ధరకు వ్యాపారస్తులు కొనటానికి ముందుకు రాకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు కూరగాయలన్నింటినీ రైవాడ కాలువలో పడేసి భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూరగాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి మార్కెట్లో కోల్డ్ స్టోరిజి నిర్మించాలని అలాగే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ తక్షణమే ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని లేదంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More