News

వ్యవసాయ చట్టం 2020తో రైతులకే ప్రయోజనం

KJ Staff
KJ Staff
Agriculture Act 2021
Agriculture Act 2021
కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అయిన కృష్ణమూర్తి సుబ్రమనియన్ నూతన వ్యవసాయ చట్టం 2020 నీ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన చట్టం ప్రేవేశపెట్టడం రైతులకే ప్రయోజనం, దీని ద్వారా మార్కెట్లో పోటీని పెంచడమే కాకుండా రైతులకు మెరుగైన దిగుబడి లభిస్తుంది అని అన్నారు. అంతే కాకుండా రిలయన్స్, ఐటీసీ లాంటి సంస్థలకు నేరుగా అమ్ముకోవచ్చు అని పేర్కొన్నారు. ఇలా పెద్ద సంస్థలకు తమ పంటను నేరుగా అమ్ముకోవడం అనేది చిన్న, సన్నకారు రైతులకు వాళ్ళ ఆదాయాన్ని మెరుగు పరుచుకోవడానికి వెసులుబాటు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(APMC) ద్వారా రైతులను ప్రోద్భలం చేసి వారి ఉత్పత్తులు అమ్మడం వల్ల నష్టాలే ఎక్కువ అంటూనే ఈ నూతన రైతు చట్టం రైతుల్లో పంటలు పండించడంలో పోటీ తత్వాన్ని పెంచుతుంది అని అభిప్రాయ పడ్డారు.
ఒకవేళ మధ్యవర్తి సరైన ధర ఇవ్వకపోతే రైతే నేరుగా మార్కెట్ కి లేదా రిలయన్స్, ఐటీసీ లాంటి సంస్థలకు  అమ్ముకోవచ్చు అంటూ నాబార్డ్‌(NAABARD) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మార్కెట్‌లో పోటీతత్వం వల్లే బ్యాంకింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, టెలికాం, ఎయిర్‌పోర్టు రంగాలు విజయాలను సొంతం చేసుకుంటున్నాయని గుర్తుచేశారు.

దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణల్లో భాగంగా కేంద్రప్రభుత్వం గతేడాది కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాటిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది అనేది మనకు తెలిసిందే. ఇంకా. ఈ నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హర్యాణాతో పాటు పలు రాష్ట్రాల రైతులు దిల్లీ సరిహద్దుల్లో గడిచిన ఆరేడు నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

Related Topics

Farmers Benefit Agriculture

Share your comments

Subscribe Magazine

More on News

More