News

భారీగా పతనమైన టమోటా ధరలు... నష్టాలలో రైతులు?

KJ Staff
KJ Staff

టమోటో రేటు భారీగా పతనం అయింది. దీంతో టమాటో సాగు చేసే రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటను సాగు చేయడానికి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టిన రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పండించిన పంటను రోడ్లపై పడేస్తున్నారు. మార్కెట్లో టమోటా ధర కిలో 20 రూపాయలు ఉన్నప్పటికీ రైతులకు మాత్రం కిలోకు రెండు రూపాయలు మాత్రమే లభించడంతో కూలి గిట్టుబాటు కాక రైతులు పొలంలోనే పంటను వదిలేస్తున్నారు.

కుప్పం,శాంతిపురం మార్కెట్లో టమోటోలు కిలో ధర దారుణంగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టమోటాలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టమోటో పండించే రైతులకు తగినంత గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులకు మద్దతు ధర కల్పిస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలియజేసినప్పటికీ ఆ మాటలను అధికారులు ఆచరణలో పెట్టడం లేదని ఈ సందర్భంగా రైతులు తెలియజేశారు.

మార్కెట్లో కిలో టమోటా 20 రూపాయలు ధర పలుకుతున్నప్పటికీ దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు తక్కువ ధర చెల్లించి వ్యాపారులు అధిక లాభాలను పొందుతున్నారని, రైతులకు కనీసం కూలీ, రవాణా చార్జీలు కూడా రావడం లేదంటూ.. బస్సు చార్జీల కోసం ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నామని రైతులు తెలిపారు. రైతులకు కొనుగోలుదారులకు మధ్య వ్యత్యాసాన్ని చూపించి మధ్యలో వ్యాపారులు అధిక లాభాలను పొందుతున్నారని అధికారులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశించినప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ మాటలను పట్టించుకోవడం లేదంటూ రైతులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More