గత నెల కురిసిన అకాల వర్షాలకు మొక్క జొన్న పంట తడిచిపోయి రైతులకు తీవ్ర నష్టం జరగగా, ప్రభుత్వం తడిచిన పంటను మద్దతు రేటు ఇచ్చి కొంటాం అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ కొనుగోళ్లు ఏ మేరకు సక్రమంగా జరగడం జరగలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తడి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా జరగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది తేమ శాతం, విత్తనాల నాణ్యతలో వంకలు చూపించి రైతులను వెనక్కి పంపిస్తున్నారు . తడిచిన మొక్కజొన్నను మద్దతు ధరకు ఎంతమేర కొనుగోలు చేయాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు లేవాణి రైతులకు చెప్తున్నారు . దీంతో మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో అయోమయం నెలకొంది.
ఇది కూడా చదవండి
విద్యార్థులకు శుభవార్త.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.1 లక్ష జమ..!
ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలోని వివిధ మండలాల్లో 15,612 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేవలం 14% తేమ ఉన్న వారికే పరిమితం చేయబడింది. జిల్లాలో 14 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. అయితే మొక్కజొన్నను ఎండిన తర్వాత ఈ కేంద్రాల్లో అందజేస్తే మొలకెత్తిన గింజలు, వంకర గింజలు, ఇతర లోపాల వల్ల తిరస్కరిస్తున్నారు . మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని ఆర్‌బికెకు రైతులు 25 మొక్కజొన్న నమూనాలను తీసుకురాగా, దురదృష్టవశాత్తు, వాటిలో 24 శాంపిల్ లను తిరస్కరించారు. అదేవిధంగా కొత్తపాలెంలోని ఆర్‌బికెకు కూడా రైతులు 10 నమూనాలు తీసుకెళ్లగా,పరీశాలన చేశాక అవన్నీ తిరస్కరించబడ్డాయి. దీంతో పాటు మొక్కజొన్నకు సరిపడా బస్తాలు అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
దెబ్బతిన్న మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆరా తీస్తే, అవసరమైన నియమ ఆదేశాల కోసం తాము ఇంకా ఎదురుచూస్తున్నామని ఆర్‌బికె సిబ్బంది వారికి తెలియజేస్తారు. ఈ నెల 13వ తేదీలోగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వివరాలను ఆర్‌బీకేల్లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ఉద్ఘాటించారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1960 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా బహింగ మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే అందించడంతో రైతులకు రూ.260 నష్టం వాటిల్లుతోంది.
ఇది కూడా చదవండి
Share your comments