News

పురుగుల మందు డబ్బాల తొ రైతుల నిరసన; ఎందుకంటే..

KJ Staff
KJ Staff

<span;>హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం మాధన్నపేట్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను కొనుగోలు చేసిన విత్తన కంపెనీ డబ్బులు చెల్లించడం లేదని , పురుగుమందుల బాటిల్‌తో నిరసనకు దిగారు.

నామిని వెంకటేష్‌కు చెందిన రాకేష్‌ సీడ్స్‌ కంపెనీకి తమ పంటను విక్రయించిన, రైతులకు డబ్బులు చెల్లించలేదని వాపోయారు.

నామిని వెంకటేష్‌కు చెందిన రాకేష్‌ సీడ్స్‌ కంపెనీకి తమ పంటను విక్రయించిన, రైతులకు డబ్బులు చెల్లించలేదని వాపోయారు.

వంగ సాంబయ్య ఆధ్వర్యంలో రైతులు పురుగుల మందు డబ్బాలతో పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. పరిష్కరించకుంటే విషం తాగుతామని బెదిరించారు. కంపెనీ యాజమాన్యాన్ని గ్రామానికి రప్పించి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా, తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కదిలేది లేదన్నారు. తమ పంటను తీసుకున్న కంపెనీ యాజమాన్యం డబ్బులు చెల్లించకుండా మోసం చేసిందని రైతులు వాపోయారు.

అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన చేస్తున్న రైతుల్లో ఒకరైన వంగ సాంబయ్య అన్నారు.

తక్షణమే అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు రైతులకు హామీ ఇచ్చారు.

Related Topics

farmers protest

Share your comments

Subscribe Magazine