త్వరలో యాంగిపంటలు క్రమక్రమంగా మార్కెట్ యార్డులకు రానున్న క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు యాసంగి పంటల రాక, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. యాసంగిలో పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడొద్దని మార్కెట్ యార్డు అధికారులను ఆదేశించారు .
మా ర్కెట్లలో జరుగుతున్న కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని కోరారు. వనపర్తి మార్కెట్లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 రోజుల్లో రూ.5 భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జనవరి నుంచి మార్చి వరకు వివిధ పంటలు మార్కెట్ కు వస్తుండడంతో అన్ని రకాల వసతుల గురించి అధికారులతో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి ర్కెట్లలోనూ భోజన సౌకర్యం కల్పించాలన్నారు. వనపర్తి, గద్వాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు స్పీడప్ చేసి మార్చి నెలాఖరు వరకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కనీస మద్దతు ధర కోసం మరో రైతు ఉద్యమానికి సన్నాహాలు..
మరోవైపు నిన్న అసెంబ్లీ సమావేశాలలో రైతులకు 90 వెలలోపు రుణమాఫీని చేయమని ప్రకటించిన మంత్రి నిరంజన్ రెడ్డి రైతులు రుణమాఫీ విషయం లో ఆందోళన చెందవద్దని రైతు రుణమాఫీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ప్రకటించారు .
2018లో రూ.21,556 కోట్లు అవసరమని అంచనా వేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.36 వేల వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
అదేవిధముగా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధి రాంపూర్‌లో రూ.5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.
Share your comments