News

రైతులే స్వయంగా ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి లాభాలు పొందుతున్నారు..

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు కు చెందిన ఒక యువరైతు కొత్త తరహాలో అలోచించి రైతుల సైతం జట్టు కట్టెల చేసి, వ్యవసాయ రంగంలో లాభాలు పొందుతున్నారు. తమ అవసరమైన సదుపాయాలను పొందడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమకూర్చుకుంటున్నారు. ఆ ప్రగతి మార్గంలో నడుస్తున్న రైతులను చూడాలంటే .. నెల్లూరు జిల్లాకు వెళ్లసిందే ..!

2016లో లేగుంటపాడు గ్రామానికి చెందిన కోవూరు మండలం, నెల్లూరు జిల్లా రైతులు చేయిచేయి కలిపి సంఘంగా ఏర్పడ్డారు. నాబార్డు సహకారంతో ఎంబీఏ చదివిన యువరైతు భూపేష్ రెడ్డితో కలిసి రైతు ఉత్పత్తిదారులు సంఘం (ఎఫ్పీవో) తరఫున ప్రగతి యువ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటిలో 100 రైతులతో 20 ఎకరాల పొలంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కాగా ఇప్పుడు కోవూరు మండలంతో పాటు ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు, జగదేవిపేట, కొత్తూరు, లేబూరు, కొడవలూరు మండలంలోని తలమంచి గ్రామ రైతులు కూడా వారితో కలిశారు.

ఈ విధముగా వివిధ పంటలు అనగా పండ్లు, పూలు, కూరగాయలు, సాగు చేసే దాదాపు 2500 మంది రైతులు కలిసి ఎఫ్పీవో సభ్యులుగా చేరారు. షేర్ కాపిటల్ రూ. 1000 వంతున , సభ్యుత్వా రుసుం రూ. 100 చొప్పున ఒక్కో సభ్యుడు చెలించి దదస్పు రూ. 25 లక్షల వరకు సమకూర్చుకున్నారు. ఈ సంఘంలో ఎక్కువగా కోవ్ల రైతులు ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి..

మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ

నాబార్డు మరియు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ రుణాలు పొంది వారికీ అవసరమైన విధ్యుత్ తుకా మంత్రాలను, రవాణా వాహనాలు, విడర్లను సమకూర్చుకున్నారు. అదేకాకుండా ఉత్పత్తిని నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ నయూనిట్లు, సోలార్ డ్రాయర్ , సోలార్ కోల్డ్ రూమ్ వంటి వాటిని సమకూర్చుకున్నారు. దాదాపుగా 14.5 లక్షల సోలార్ కోల్డ్ రూమ్ నిర్మాణానికి ఖర్చుకాగా , ప్రభుత్వం రూ. 11 లక్షలు సబ్సిడీ ఇచ్చింది. వచ్చిన ఉత్పత్తిని గిట్టుబాటు ధరలకే అమ్ముకునే విధముగా అధికారులు అవకాశం కల్పించారు. ఒకవేళ పంట ఉత్పత్తులకు
ధర లేకపోయినా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి ధర వచ్చినప్పుడే మార్కెట్కు పంపిస్తున్నారు.

విదేశాలకు ఎగుమతులు చేసే లక్ష్యంగా..

రైతులకు అన్ని అవసరాలు తీర్చడంతో పాటు రైతులే సొంతంగా మార్కెటింగ్ చేసుకునే స్థాయికి చేరుకున్నాం. ఆధునిక పద్ధతులతో సేంద్రియ పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ సహకారంతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సోలార్ కోల్డ్ స్టోరేజ్లు, మార్కెటింగ్ కోసం వారాంతపు సంత ఏర్పాటు చేసుకున్నాం. విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం.

ఇది కూడా చదవండి..

మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ

ఆధునిక పద్ధతిలో సాగు

ఇక్కడి రైతులందరు ఐక్యమత్యంతో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరారు. వారికీ పంట సాగుపై శిక్షణ ఇస్తుండడంతో పాటు ఆధునిక పద్దతిలో ఏవిధముగా సాగు చేయాలనీ నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది భూసార పరీక్షలు చేయించి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుతున్నారు. ఇలా చేయడం వాళ్ళ పంట దిగుబడి పెరుగుతుంది మరియు ఖర్చు కూడా తగ్గుతోంది.

ఇది కూడా చదవండి..

మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ

Related Topics

more profits

Share your comments

Subscribe Magazine

More on News

More