News

MSP చట్టం తీసుకురాకుంటే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారు- మేఘాలయ గవర్నర్

Srikanth B
Srikanth B

"రైతుల ఉద్యమం ఇంకా ముగియలేదు; ధర్నా ముగిసింది. MSP పై చట్టాన్ని ఆమోదించకపోతే దేశ పరిపాలనపై రైతులు కఠినమైన యుద్ధం చేస్తారు" అని మేఘాలయ గవర్నర్ పేర్కొన్నారు.ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టాన్ని ఆమోదించకుంటే ప్రభుత్వంపై రైతులు "భీకర పోరాటం" చేస్తారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.

జైపూర్‌లో జరిగిన జాట్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మేఘాలయ గవర్నర్‌గా తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. రైతు సమస్యలపై ఆయన ఇటీవల పలు సందర్భాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

" రైతుల ఉద్యమం  ఇంకా ముగియలేదు; ధర్నా ముగిసింది. ఎంఎస్‌పిపై చట్టాన్ని ఆమోదించకపోతే దేశ ప్రభుత్వంపై రైతులు భీకర యుద్ధం చేస్తారు." మాలిక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మేఘాలయ గవర్నర్‌గా తనకు నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉందని, తన పదవీకాలం పూర్తికాగానే ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపినప్పుడు, తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి తమకు అన్యాయం జరుగుతోందని హెచ్చరించానని మాలిక్ చెప్పారు.

వరి MSP రూ. 2,930 పెంచాలిని డిమాండ్ !

రైతులతో పరిస్థితిని పరిష్కరించుకోవాలని తాను ప్రధాని మోదీకి సూచించానని, అయితే తామే ధర్నా విరమిస్తామని మోదీ చెప్పారని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 2020 నుండి, వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కోరుతూ, పంజాబ్ మరియు హర్యానాకు చెందిన పదివేల మంది రైతులు నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల వెలుపల నిరసన తెలిపారు . డిసెంబర్ 2021లో ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత, నిరసన ముగిసింది.

పేద ప్రజలు నాశనమవుతుంటే కంపెనీ ఎలా ధనవంతులు అవుతోంది అని మోదీని అడిగారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

గత ఏడాది డిసెంబర్‌లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాలిక్ గత నెలలో పేర్కొన్నారు.

తమ ధర్నాను విరమించే ముందు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన నిరసనకారుల అభ్యర్థనలలో కొన్ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన సందర్భంగా వారిపై పెట్టిన కేసుల ఉపసంహరణ, MSPపై చట్టపరమైన హామీ మరియు నిరసన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం. .

రైతుల సమస్యలపై తాను మోదీని కలవడానికి వెళ్లినప్పుడు’  ప్రధాని తన అహంకారం చూపించారని అని, ప్రధానితో తాను ఐదు నిమిషాల పాటు పోరాడానని మాలిక్ జనవరిలో పేర్కొన్నారు.

కోనసీమ రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం: నాగిరెడ్డి

Share your comments

Subscribe Magazine

More on News

More