రైతులను ఆందోళన కల్గిస్తున అకాలవర్షాలు .. మరో 2 రోజులు భారీ వర్షాలు !రెండు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి , వడగళ్ల వర్షం కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది .ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా రైతులు నష్టపోగా రానున్న 2 రోజులపాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతాహవారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు కూడా వర్ష సూచన ఉందని వాతావారణ కేంద్రం తెలిపింది.ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు
రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీన పడిందని.. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా కొనసాగుతుందని దీని ప్రభావంతో రాష్ట్రా వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .
మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు .. !
ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలలో రాబోయే రెండు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా కూడా లంగాణ వ్యాప్తంగ అన్ని జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్,జామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లలో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది .
Share your comments