News

అధికారంలోకి రాగానే వారికి ఐదు శాతం రిజర్వేషన్లు.. నారా లోకేష్ హామీ..!

Gokavarapu siva
Gokavarapu siva

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభయమిచ్చారు. యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్, పలువురు తెలుగుదేశం సభ్యులతో కలిసి కేంద్రం అందించే ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి కాపులకు ఎలాంటి ఆటంకం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా రాజుల కొత్తూరులో పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తుల కోసం కేంద్రం నిర్ణయించిన 10 శాతం రిజర్వేషన్ పరిమితిలో 5 శాతం కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. బీసీల్లో కాపులకు రిజర్వేషన్ల అమలు సజావుగా, సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి తోడు కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న వ్యూహంపై లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తునిలో కాపు ప్రత్యేక సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కాపులకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తానని ప్రగల్భాలు పలికి చివరకు కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన జగన్ తీరుపై లోకేష్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..

ఏపీ రైతులకు శుభవార్త.. రైతుభరోసా నిధులకు మరొక ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..

కాపులకు ఏడాదికి 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్.. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని లోకేశ్ విమర్శించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. దీనికి గుర్తుగా కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేష్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ప్రతి మైలురాయి వద్ద ఓ హామీ ఇస్తున్న లోకేష్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదల ఆకలి తీర్చేలా తేటగుంట పంచాయతీలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ వెంట ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ , బావమరిది మోక్షజ్ఞ యాత్రలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

ఏపీ రైతులకు శుభవార్త.. రైతుభరోసా నిధులకు మరొక ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..

Share your comments

Subscribe Magazine

More on News

More