గత సంవత్సరం వరుసగా రెండు పంటలు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఆ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటుంది , ఒక వైపు పెరిగిన వస్తువుల ధరలు మరోవైపు సాధరణ పౌరుల కొనుకోలు సామర్ధ్యం తగ్గడం తో దేశం మరింత సంక్షోభం లో పడింది .
శ్రీలంక కరెన్సీ సంక్షోభం యొక్క క్లిష్టమైన పరిస్థితి రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక గందరగోళానికి దారితీసింది. అంతేకాకుండా, కరెన్సీ పతనం రెండేళ్లలో ఆహార ధరలలో 100% పెరుగుదలకు దారితీసింది. వీటన్నింటి మధ్య, అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సాయం కోసం ఇతర దేశాల సహాయాన్ని కోరాడు .
శ్రీలంక లో 40 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారు . వారిలో దాదాపు 10 శాతం రైతుల ఆదాయం తగ్గి నట్లు తద్వారా వారు రుణాలపై ఆధారపడడం తో దేశం ఉత్పత్తి క్షిణించి ధరలు మరింత పెరిగియాయని ఇప్పటికి ప్రజలు కనీస ఆహార అవసరాలను తీర్చుకోలేని స్థితికి ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని శ్రీలంకలోని ది ఐలాండ్ ఆన్‌లైన్ ఇంగ్లీషు-భాషా దినపత్రిక తన కధనం లో రాసుకొచ్చింది . ఇంకా, దేశం ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన ఫోరెక్ నిలువలు సరిపోయని బుదేశం కోలుకోవడానికి కనీసం మరో 2 సంవత్సరాలు పడుతుందని ఆన్‌లైన్ ఇంగ్లీషు దినపత్రిక రాసుకొచ్చింది .
నూతన సంవత్సరం షాకింగ్ న్యూస్ :రూ.25 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ...
"రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులను అందించడానికి తక్షణ చర్య గ తీసుకొని ,రైతులు, పశువుల పెంపకందారులు మరియు మత్స్యకారులకు నగదు సహాయం అందించడం వంటి చర్యల ద్వారా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని మరియు FAO వెల్లడించింది .
2023లో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు ఆదేశ ప్రధాని దానిని అధిగమించడానికి దేశం చర్యలు తీసుకుంటుందని దీనిని పరిష్కరించడానికి మేము ఆహార భద్రత కార్యక్రమాన్ని ప్రారంభింమని అయన తెలిపారు . రైతులకు అవసరమైన సాయం మరియు ఎరువులు ,విత్తనాలు అందిస్తున్నామని అయన తెలిపారు .
Share your comments