దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరింది. గత నెల రోజులుగా పెరగని చమురు ధరలు బుధవారం అకస్మాత్తుగా పెరిగాయి.
నిన్న పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరగ్గా.. కంపెనీలు గురువారం మరో 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84.20 చేరింది.
కోల్‌కతాలో రూ.85.68, ముంబైలో రూ.90.83, చెన్నైలో రూ.86.96, బెంగళూరులో 87.04, భువనేశ్వర్ రూ.84.68, హైదరాబాద్‌లో 87.59, జైపూర్‌లో రూ.92.17కు చేరింది. ఇదిలా ఉండగా.. డీజిల్ ధర ఢిల్లీ లీటర్‌కు 26 పైసలు పెరగ్గా ప్రస్తుతం రూ.74.38కి చేరింది.
కోల్‌కతాలో రూ.77.97, ముంబైలో రూ.81.07, చెన్నైలో రూ.79.72, బెంగళూరులో రూ.78.87, హైదరాబాద్‌లో రూ.81.17, జైపూర్‌లో రూ.84.14కు చేరింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
2018 అక్టోబర్ 4న పెట్రోల్ రేట్ రూ.84 ఉండగా.. ప్రస్తుతం రూ.84.20కు చేరుకుంది.
Share your comments