వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. రైతులకు అవసరం అనుకున్నప్పుడు వర్షం పడదు. అవసరం లేనప్పుడు వర్షాలు పడటం వల్ల పంట నష్టం జరుగుతూ ఉంటుంది. ఆకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయి నష్టాల పాలవుతూ ఉంటారు. దీంతో రైతులు ముఖ్యంగా ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. ముందే వాతావరణ సమాచారం తెలుసుకోవడం ద్వారా పంటలకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
దీని ద్వారా పంటను కొంతమేర ఆకాల వర్షాల నుంచి కాపాడుకోవచ్చు. ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ఏ రోజుకి ఆ రోజు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ సమాచారం ఎలా ఉంది. రాబోయే కొద్దిరోజులు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశముందని చెప్పారు.
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అటు ఏపీలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకావముందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
అయితే ఆకాల వర్షాలతో రైతుల పంటకు తీవ్ర నష్టం చేకూరుతుంది. పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.. రైతులు ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకుని ముందు జాగ్రత్త పడటం మంచిది.
Share your comments