News

ఏపీ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రాగులు ,జొన్నలు..ఏప్రిల్‌ నుంచే అమలు!

Srikanth B
Srikanth B

2023 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి "మిల్లెట్ ఇయర్ " చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే . భారతదేశమ్ చొరవతో ఐక్య రాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దీనిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంబిస్తున్నాయి. దీనిలో భాగం గానే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం బదులుగా రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది .

ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త. రేషన్ కార్డులు ఉన్నవారికి చిరుధాన్యాల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ నెల నుంచి రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండగా, ప్రతినెల ఇచ్చే రేషన్ లో రెండు కేజీల బియ్యం బదులుగా రాగులు, జొన్నలు సరాఫరా చేయనుంది.

అటు రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేలా ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే, వారికి నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండి అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు .

మార్చి 31 తో ముగియనున్న పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు ..

రాగులు ,జొన్నలు పంపిణి పై ఇప్పటికే ప్రజలనుంచి సూచనలను తీసుకున్న ప్రభుత్వం బియ్యం స్థానంలో జొన్నలు , రాగులు తీసుకోవడానికి ప్రజలు సుముఖముగా ఉన్నట్లు సమాచారం అయితే తొలుత రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి ఒకవేళ ఇక్కడ ప్రాజెక్టు విజయం సాధిస్తే రాష్ట్రము అంతటా దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం .

మార్చి 31 తో ముగియనున్న పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు ..

Related Topics

finger millet

Share your comments

Subscribe Magazine

More on News

More