News

రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం: ఇది మీకు తెలుసా?

Srikanth B
Srikanth B
రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం: ఇది మీకు తెలుసా?
రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం: ఇది మీకు తెలుసా?

భారతదేశంలో చాలా మంది ప్రజలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు రైళ్లు ప్రధాన ఎంపిక . బస్సులు మరియు విమానాలు వంటి ఇతర రవాణా మార్గాల కంటే రైలు ఛార్జీలు చౌకగా ఉంటాయి. భద్రత కూడా ఎక్కువే.

రైలులో ప్రయాణించే వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య రైలు ఆలస్యంగా రావడం . రైలు ఆలస్యంగా రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది తద్వారా రైలు ప్రయాణం చేసే మహిళలు మరియు వృద్దులకు సమస్యగా మారుతుంది అయితే రైలు ఆలస్యంగ నడిస్తే ప్రయాణికులకు ఆహారం అందించాలనే నిబంధన ఉంది .

రైలు ఆలస్యం అయితే IRCTC మీకు కొన్ని సేవలను ఉచితంగా అందిస్తుంది. మీ రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా నడుస్తుంటే IRCTC మీకు ఆహారం మరియు శీతల పానీయాలను అందిస్తుంది. IRCTC సంస్థ ద్వారా ఈ భోజనం మీకు పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది . మీరు రైల్వే యొక్క ఈ సౌకర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైనప్పుడు IRCTC యొక్క క్యాటరింగ్ పాలసీ ప్రకారం ప్రయాణీకులకు అల్పాహారం మరియు భోజనం అందించబడుతుంది.

నియమం
IRCTC నిబంధనల ప్రకారం, ప్రయాణీకులకు ఉచిత భోజనం అందించబడుతుంది. కానీ రైలు 30 నిమిషాలు ఆలస్యమైతే భోజన సౌకర్యం లేదు. క్యాటరింగ్ విధానం ప్రకారం, రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందించబడుతుంది. శతాబ్ది, రాజధాని, దురంతో మొదలైన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సేవ అందుబాటులో ఉంది.

AAI రిక్రూట్‌మెంట్ 2022: 50+ సీనియర్/జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి!

 

ఆహార జాబితా
అల్పాహారం టీ లేదా కాఫీ మరియు రెండు బిస్కెట్లు, సాయంత్రం స్నాక్ టీ లేదా కాఫీ మరియు నాలుగు బ్రెడ్ ముక్కలు. IRCTC ప్రయాణీకులకు భోజనం లేదా రాత్రి భోజనం కోసం అన్నం, పప్పు, ఊరగాయలను అందిస్తుంది. లేదా 7 పూరీలు, వెజ్/ఆలూ భాజీ, ఊరగాయ ప్యాకెట్ ఇస్తారు.

AAI రిక్రూట్‌మెంట్ 2022: 50+ సీనియర్/జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి!

Related Topics

Free food train passengers

Share your comments

Subscribe Magazine

More on News

More