అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఎవరూ అసంతృప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ పథకాలను అందరికీ అందించాల్సి ఉంటుంది. అలాగే వెనుకబడిన వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాగే సామాజికవర్గా ల ఆధారంగా కూడా వారికి అవసరమైన పథకాలను తెస్తుంది.
అందులో భాగంగా తాజాగా హెయిర్ సెలూన్లు, దోభీ ఘాట్లు, లాండ్రీ షాపుల వారికి సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వారి షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 1 నుంచి హెయిర్ సెలూన్లు, దోభీ ఘాట్లు, లాండ్రీ షాపులకు ఉచితంగా కరెంట్ అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రామాల నుంచి సిటీల వరకు అన్ని హెయిర్ సెలూన్లు, దోభీ ఘాట్లు, లాండ్రీ షాపులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 250 యూనిట్ల వరకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని తెలిపింది. దీని వల్ల రాష్ట్రంలోని లక్షలాదిమంది రజక, నాయిూ బ్రహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఉచితంగా విద్యుత్ అందించాలని రజక, నాయూ బ్రహ్మణ సంఘాలు ఎప్పటినుంచో కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వారి డిమాండ్‌ను నెరవేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అత్యంత బలహీనవర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, తరతరాలుగా కులవృత్తి చేస్తున్న లక్షలాదిమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ చెప్పారు. అటు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రజక, నాయిూ బ్రహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, ఇక ఏపీలో కూడా వెనుకబడిన బీపీఎల్ కింద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Share your comments