కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు కోల్పోవడం, ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీ పనులు లేక రోజువారీ కూలీ పనులు చేసుకుని బ్రతికేవాళ్లు అవస్థలు పడుతున్నారు. సరుకులు కొనుక్కోవడానికి డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అనే స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేదలకు ఫ్రీగా రేషన్ అందిస్తోంది. బియ్యంతో పాటు కందిపప్పు, ఇతర నిత్యావసరాల సరుకులు ఉచితంగా అందిస్తోంది.
గత లాక్ డౌన్ సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మళ్లీ సెకండ్ వేవ్ సమయంలో ఈ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రక్రియ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రేషన్ డీలర్ల ద్వారా చేపట్టాలని ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెగ్యులర్ పీడీఎస్ కింద రేషన్ సరుకులు ప్రభుత్వం చేసింది. అయితే కేంద్ర పథకం ద్వారా అందించే ఉచిత బియ్యాన్ని నేటి నుంచి పంపిణీ చేయబోతున్నారు.
పీఎంజీకేఏవై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉచిత బియ్యాన్న అందిస్తున్నట్లు రేషన్ షాపుల్లో ప్రత్యేకంగా పోస్టర్లు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఉచితంగా ఇస్తున్నారనేది పేదలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ మేరకు పోస్టర్లు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం మొత్తం 1.47 కోట్ల కార్డుల్లో.. 88 లక్షల ఎ కార్డులకే వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
మిగిలిన 59 లక్షల కార్డులకిచ్చే బియ్యం భారం మొత్తాన్ని తామే భరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రేషన్ షాపుల దగ్గర కొవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రజల రద్దీ లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామంది.
Share your comments