అమరావతి రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు సొమ్మును తాజాగా విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.195 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
తమకు కౌలు చెల్లించాలంటూ కొంతమంది రైతులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తమకు వెంటనే కౌలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరకగముందే.. ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని నిర్ణయించింది.
గతంలో కూడా తమకు కౌలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ అనంతరం కౌలు చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు అనంతరం ప్రభుత్వం కౌలు చెల్లించింది.
అయితే ఆ సారి హైకోర్టులో విచారణ జరగకముందు ప్రభుత్వం మేల్కోంది. వెంటనే అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ చేపట్టగా.. రాజధాని అమరావతి కోసం 30 వేల ఎకరాలు రైతుల నుంచి ప్రభుత్వం సమీకరించింది. రైతుల నుంచి తీసుకున్న భూమికి ప్రతి ఏడాది ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉంది.
అంతేకాకుండా అభివృద్ధి చేసిన తర్వాత సగం భూమిని రైతులకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రైతులకు ప్రతి ఏడాది కౌలు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఆలస్యం చేస్తుండటంతో రైతులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
Share your comments