జూన్ 15 నుండి మూడు రోజుల పాటు జరుగనున్న G 20 సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైనది. 15-17 వరకు జరగనున్న ఈ సమావేశాలకు నేడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ , స్టేట్ క్యాడర్ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ , తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల డైరెక్టర్ జనరల్‌లు దాదాపు 200 మంది ప్రతినిధులు , అగ్రిమీడియా కృషి జాగరణ్ ఎడిటర్ అండ్ చీఫ్ ఎం. సి డొమినిక్ , వివిధ శాఖలకు చెందిన వ్యవసాయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు .
ఈ సమావేశంలో పెరిగిన పంటల ఉత్పత్తి, దిగుబడితో వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు . జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జి20 సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.
వచ్చే నెలలో హెచ్‌ఐసీసీలో జరగనున్న జీ20 సదస్సు ఏర్పాట్లను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సమీక్షించారు. హైదరాబాద్‌లోని గొప్ప సంస్కృతి, వ్యవసాయ రంగంలో పురోగతిని దృష్టిలో ఉంచుకుని జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు .
రైతులు నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా?
జూన్ 16న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రులను, ఇతర ప్రతినిధుల బృందానికి స్వాగతం పలకడంతో సమావేశం ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మంత్రివర్గ కార్యక్రమాలలో ఆహార భద్రత మరియు పోషకాహారం , సుస్థిర వ్యవసాయంపై చర్చలు మరియు మూడు సమాంతర సెషన్‌లలో మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, స్థిరమైన జీవవైవిధ్యం మరియు వాతావరణ సమస్యల పరిష్కారాలపై ఉన్నత స్థాయి మంత్రివర్గ చర్చలు ఉంటాయి.
జూన్ 17న అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, G20, ఇండియన్ ప్రెసిడెన్సీ ఫలితాలను ఆమోదించడంతో సమావేశం ముగుస్తుంది. ప్రతినిధి బృందం సభ అనంతరం హైదరాబాద్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు వెళ్లనున్నారు .
Share your comments