జూన్ 15 నుండి మూడు రోజుల పాటు జరుగనున్న G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది హైదరాబాద్ .వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల డైరెక్టర్ జనరల్‌లు దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలోపాల్గొననున్నారు.
జూన్ 15 న వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో భారతదేశం సాధించిన విజయాలను తెలియజేస్తూ స్టేట్ క్యాడర్ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానున్నది తరువాత వ్యవసాయ డిప్యూటీల మంత్రుల సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ,డిజిటల్‌గా డిస్‌కనెక్ట్ వంటి అంశాల పై చర్చలు జరగనున్నాయి .
జూన్ 16న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రులను, ఇతర ప్రతినిధుల బృందానికి స్వాగతం పలకడంతో సమావేశం ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మంత్రివర్గ కార్యక్రమాలలో ఆహార భద్రత మరియు పోషకాహారం , సుస్థిర వ్యవసాయంపై చర్చలు మరియు మూడు సమాంతర సెషన్‌లలో మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, స్థిరమైన జీవవైవిధ్యం మరియు వాతావరణ సమస్యల పరిష్కారాలపై ఉన్నత స్థాయి మంత్రివర్గ చర్చలు ఉంటాయి.
రైతులకు పంట నష్ట పరిహారంగా 1.71 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ప్రభుత్వం..
జూన్ 17న అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, G20, ఇండియన్ ప్రెసిడెన్సీ ఫలితాలను ఆమోదించడంతో సమావేశం ముగుస్తుంది. ప్రతినిధి బృందం సభ అనంతరం హైదరాబాద్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు వెళ్లనున్నారు .
Share your comments