అనంత రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్న గణనాధుడు కోటి రూపాయలతో వినూత్నంగా అలంకరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ భక్తులు. పాల్వంచలోని రామ్ నగర్ లో తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.వినాయకుడి మండపాన్ని పూలతో,విద్యుత్ దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష్మీవారం కావడంతో 10 నుంచి 500 నోట్లతో వినాయకుడిని కోటి పదిలక్షల రూపాయలతో వైభవంగా అలంకరించారు.కోటి రూపాయల వినాయకుడిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
మరోవైపు తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.2.30 కోట్ల రూపాయల నోట్లతో గణనాథుని అలంకరణ చేసాడు ఓ వ్యాపారి.
ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల విలువైన నోట్లను అలంకరణ కోసం వినియోగించారు గుప్తా. 20,50,100,500 నోట్లను ఉపయోగించి భారీగా అలంకరించారు. కాసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులను అభినందించారు. విగ్రహానికి అలంకరించిన నగదు చూసి లోకేష్ షాక్ అయ్యారు.
Share your comments