News

Garib Kalyan yojana : మరో మూడు నెలలు ఉచితం గ బియ్యం పంపిణి !

Srikanth B
Srikanth B
Free rice distribution for another three months
Free rice distribution for another three months

దేశ వ్యాప్తం గ పౌరులకు తెల్ల రేషన్ కార్డు మీద గత కొంత కాలం గ ఉచితం గ బియ్యం అందిస్తున్న కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని మరో 6 నెలలపాటు పొడిగించే అవకాశం వుండేట్లుగా సమాచారం అందుతుంది అదేవిధంగ దీనిక్రింద చాలామంది అనర్హులు లబ్దిపొందుతున్నారు అని భావించిన కేంద్ర ప్రభుత్వం వారని గుర్తించేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది.

గరీబ్ కల్యాణ్ యోజన మరిన్ని నెలలు పెంపు :

మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.

రద్దు దిశగా రేషన్ కార్డులు
రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్‌ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది.

రేషన్ కార్డు కొత్త నిబంధనలు :

మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి .

Ration Card: మీరు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..? వచ్చిందో లేదో తెలుసుకోండిలా ..!

 

Share your comments

Subscribe Magazine

More on News

More