News

చేపల పెంపకం నుండి అధిక రాబడిని పొందండి...

KJ Staff
KJ Staff

కొవిడ్ కారణంగా చాల మంది యువతీ, యువకులు నగర మరియు పట్టణాలను వదిలి, తమ సొంత ఊళ్లకు చేరుకొని వ్యవసాయానికి చెందిన వివిధ రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా యువత చేపలు, కోళ్లు, పండ్ల తోటలు, పాడి ఉత్పతులు వంటి రంగాల్లో అడుగుపెడుతున్నారు. తమ తోటి రైతులకు ఆదర్శంగా నేటి యువత నిలుస్తుంది. క్యాదిగాళు గ్రామానికి చెందిన బుజ్జిరాజు కొడుకైనా రఘురామరాజు మరియు కోడలు బిందు మాధవి ఇంజినీరింగ్ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకునేవారు. కోవిడ్ మూలాన ఉద్యోగాలు వదిలేసి, సొంత గ్రామం అయినా క్యుడిగాళు వచ్చి 35 ఎకరాల్లో చేపలు మరియు రొయ్యల సాగును చేయడం ప్రారంభించారు. వీరు చాలా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా రామాయణపురం గ్రామానికి చెందిన బుజ్జిరాజు కుప్పగాల్లు గ్రామంలో పండ్ల తోటలు సాగు చేసేవారు. కానీ దిగుబడి అనేది అనుకున్న స్థాయిలో రాకపోవడంతో కురుగోడు తాలూకా క్యాదిగాళు గ్రామం దగ్గరలో వ్యవసాయానికి పనికిరాని భూములను కొని చేపలను పెంచడం ప్రారంభించారు. మొదట 12 ఎకరాల్లో మత్స్యసాగును చేస్తూ, పొలం వద్దనే ఇల్లు నిర్మించుకున్నారు. వారి కుమారుడు మరియు కోడలు కోవిడ్ కారణంగా ఉద్యోగం వదిలి రావడంతో 12 ఎకరాల్లో ఉన్న మత్స్యసాగును 35 ఎకరాలకు విస్తరించి చేపల సాగును చేస్తూ, మిగిలిన చెరువులో రొయ్యలు సాగు చేస్తున్నారు.

రఘురామరాజు ప్రస్తుతం 12 ఎకరాల్లో రూప్‌చంద్ అనే రకం చేపలను పెంచుతున్నారు. 3 నుంచి 4 టన్నుల దిగుబడి ఎకరానికి సాధిస్తూ లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇంకోవైపు 23 ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. 2 నుండి 4 టన్నుల వరకు రొయ్యల ఉత్పత్తిని ఒక ఎకరానికి పొందుతున్నారు. దిగుబడి అనేది మూడు నుండి నాలుగు నెలల్లో వస్తుండడంతో ఏడాదికి రెండుసార్లు పెంచుతున్నారు. రొయ్యల సాగుపై ఖర్చులు పోగా ఎకరానికి లక్ష నుండి 1.5 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఎక్కువగా సాగుపైనే దృష్టి పెట్టి మంచి రాబడితో పాటు, మార్కెట్ పై అవగాహనా తెచ్చుకుని లాభాలను పొందుతున్నారు.

ఇది కూడా చదవండి..

ఫార్మ్ టూరిజం యువ'సాయం' - వన్డే ఫార్మింగ్

వ్యవసాయానికి పనికి రాని చౌడు భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసారు. మత్య్సుశాఖాధికారి శివప్ప సహకరించడంతో ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు కింద ఆర్ధిక సహాయాన్ని పొందారు. 25 ఎకరాల సొంత భూమితో పాటు సమీపంలోని మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నారు. కూలీలపై ఆధారపడకుండా ఇంటివారే చేయడంతో ఖర్చులు తగ్గడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చేయడంతో మంచి దిగుబడి సాధిస్తున్నారు. దాణా వేయడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మందులు వాడకం, కృత్రిమంగా గాలిమరల నుంచి గాలిని అందించడం, రాత్రి పూట కాపలా ఉండి సంరక్షిస్తున్నారు. చేపలు, రొయ్యలను పట్టడానికి మాత్రమే కూలీలను ఉపయోగిస్తారు. పెట్టుబడి పోను ఏటా ఎకరాపై రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవడం వారికీ చాల సంతోషం కలిగిస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి..

ఫార్మ్ టూరిజం యువ'సాయం' - వన్డే ఫార్మింగ్

Related Topics

fish farming more profits

Share your comments

Subscribe Magazine

More on News

More